Cricket Stadium: 'మోదీ'కి చంద్రబాబు ఝలక్‌.. ఏపీ రాజధానిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం

Biggest And Largest Cricket Stadium In AP Capital Amaravati: దేశంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ఆంధ్రప్రదేశ్‌లో సిద్ధం కాబోతున్నది. దీనికి సంబంధించి కీలక ముందడుగు పడింది. స్టేడియం నిర్మాణానికి ఐసీసీ అంగీకరించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్‌ సంఘం ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 24, 2025, 05:08 AM IST
Cricket Stadium: 'మోదీ'కి చంద్రబాబు ఝలక్‌.. ఏపీ రాజధానిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం

Amaravati Cricket Stadium: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని సంకల్పించింది. అందులో భాగంగా దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రికెట్ కు కేంద్రంగా ఏపీని నిలపాలని.. భావి క్రికెటర్లను ఆంధ్రప్రదేశ్ నుంచి తయారుచేయాలనే పట్టుదలలో భాగంగా ఈ క్రికెట్ స్టేడియం నిర్మించాలని చూస్తోంది. స్టేడియం నిర్మాణానికి అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) కూడా ఆమోద ముద్ర వేసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ చైర్మన్ గా ఉన్న జై షా ఈ స్టేడియం నిర్మాణానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం.

Add Zee News as a Preferred Source

Also Read: SRH vs RR Highlights: ఐపీఎల్ లో హైదరాబాద్ బోణీ.. రాజస్థాన్ పై 'రికార్డు' విజయం

అమరావతిలో నిర్మించే ఈ స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. దీనికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కేశినేని చిన్ని ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఛైర్మన్‌ జైషా అనుమతి ఇచ్చినట్లు కేశినేని శివనాథ్ ప్రకటించారు. రెండున్నర ఏళ్ల లోపల స్టేడియం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకారం అందిస్తుందని కేశినేని చిన్ని వివరించారు.

Also Read: CSK Vs MI: తొలి మ్యాచ్ లోనే ముంబైకి షాక్.. చెన్నై విజయారంభం..

రాష్ట్రంలోని రెండు క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు కేశినేని చిన్ని ప్రకటించారు. విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నట్లు వివరించారు. విశాఖపట్నంలోని ఏసీఏ - వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు నెలల్లోనే మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత స్టేడియంలోని ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 30 మైదానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. 

దేశంలో అహ్మదాబాద్‌లోని అంతర్జాతీయ స్టేడియం అతిపెద్దది. ఈ స్టేడియాన్ని మించేలా లక్షా 32 వేల సీటింగ్ సామర్థ్యంలో అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అమరావతిలో 60 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఏసీఏ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులోనే అమరావతి స్టేడియం నిర్మించాలని ఏసీఏ భావిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News