ఏపీ పీడీ అకౌంట్స్ ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం; బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సంచలన ఆరోపణ 

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సర్కార్ పై సంచలన ఆరోపణ చేశారు. పర్సనల్ అకౌంట్స్  ( పీడీ అకౌంట్స్) కుంభకోణం ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు.                                

Last Updated : Aug 7, 2018, 12:06 AM IST
ఏపీ పీడీ అకౌంట్స్ ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం; బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సంచలన ఆరోపణ 

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సర్కార్ పై సంచలన ఆరోపణ చేశారు. పర్సనల్ అకౌంట్స్  ( పీడీ అకౌంట్స్) కుంభకోణం ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిధులు దొడ్డిదారి నుంచి మళ్లిస్తున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇందులో రూ.53 వేల కోట్లు కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణం 2జీ, బొగ్గు, సీడబ్ల్యూసీ, ఫాడర్ స్కామ్ మాదిరిగా ఉందని..దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.  

పక్క రాష్ట్రాల్లో వందల కోట్ల కుంభకోణం జరిగితే అక్కడి ప్రభుత్వాలు వెంటనే కూలిపోతాయని..కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నమని తెలిపారు. కుంభకోణాలు బయటికి రాకుండా మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. పీడీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఈ కుంభకోణం నుంచి బయటపడేందుకు  ప్రధాని మోదీ సహకరించలేదనే కారణంతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిందంటూ జీవీఎల్ తన ట్వీట్‌లో ఆరోపించారు.

Trending News