Borugadda Arrest: లొంగిపోయిన బోరుగడ్డ.. హైకోర్టు సీరియస్..

Borugadda Arrest: ఏపీ చంద్రబాబు నాయుడును చంపేస్తానంటూ వార్తల్లో నిలిచిన రౌడీ షీటర్.. బోరుగడ్డను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈయన రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ ను పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు.‌

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2025, 01:31 PM IST
Borugadda Arrest: లొంగిపోయిన బోరుగడ్డ.. హైకోర్టు సీరియస్..

Borugadda Arrest: గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు విచారణకు సంబంధించి  బోరుగడ్డ అనిల్ ను  పీటి వారెంట్ ద్వారా  గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో బోరుగడ్డను గుంటూరు తరలించారు.
అంతకు ముందు  రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు. ఫాస్టర్‌ను బెదిరించడంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్‌పై గుంటూరు పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకోనున్నారు.

Add Zee News as a Preferred Source

ఉదయం 6 గంటలకు రాజమండ్రి జైల్లో బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. దీంతో రాజమండ్రి జైలు నుంచి అనిల్‌ను అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఇలా వుండగా  రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

అవసరమైతే.. చెన్నై నుంచి ఫ్లైట్‌లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. బోరుగడ్డ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో రాజమండ్రి జైలులో లొంగిపోవాలని బోరుగడ్డ అనిల్ కుమార్ ను  ఆదేశించింది

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News