Visakha Knife Attack: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రియురాలు, ఆమె తల్లిపై కత్తులతో దాడి.. చంద్రబాబు నాయుడు సీరియస్..

Visakha lover knife attack: విశాఖలో పట్టపగలు ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లి  తల్లితో పాటు ప్రియురాలిపై కూడా ఇష్టమున్నట్లు దాడిచేశారు. వదిలేయాలని ఎంతగా ప్రాధేయ పడిన కూడా విడిచిపెట్టకుండా ఘోరానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 2, 2025, 05:40 PM IST
  • విశాఖ లో యువతిపై ఆమె ప్రియుడు దాడి..
  • ఖండించిన ఏసీ సీఎం..
Visakha Knife Attack: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రియురాలు, ఆమె తల్లిపై  కత్తులతో దాడి.. చంద్రబాబు నాయుడు సీరియస్..

Visakha lover attacks case latest news: ప్రభుత్వాలు ఎన్ని కఠినచట్టాలు తీసుకొచ్చిన కూడా మహిళలు, అమ్మాయిలపై అరాచకాలు, అఘాయిత్యాలు ఆగడంలేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళలపై వేధింపులు, కత్తులతో దాడులు, అత్యాచారాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఉగాది రోజున గుడికి వెళ్లిన మహిళపై అత్యాచారం ఘటన సంచలనంగా మారింది. ఇక ఎయిర్ పోర్టుకు తీసుకెళ్తామని చెప్పి జర్మీనీకి చెందని యువతిపై కొంత మంది కేటుగాళ్లు అఘాయిత్యంకు పాల్పడ్డారు.

Add Zee News as a Preferred Source

ఇక ఏపీలో తాజాగా.. ప్రేమోన్మాది తనను దూరంగా పెడుతుందని కోపంతో ఏకంగా ఆమె ఇంటికి కత్తిపట్టుకుని మరీ వెళ్లాడు. తల్లి, కూతుళ్లను కత్తితో పలుమార్లు పొడిచి తల్లిని పొట్టనపెట్టుకున్నాడు. యువతి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ఘటనలు రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా సంచలంగా మారాయని చెప్పుకొవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కూటమి సర్కారు మహిళ భద్రతకు పెద్ద పీట వేసింది. సోషల్ మీడియాలో కానీ..మరెక్కడ అయిన మహిళలకు వేధించే విధంగా పోస్టులు పెడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. కానీ ఇటీవల ఏపీలో మహిళలపై తరచుగా అత్యాచారాలు, దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖలోని స్థానికంగా స్వయం కృషి  నగర్ లో ఈ రోజు మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. దీపిక అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.

దీపిక డిగ్రీ చదివి ఇంట్లోనే ఉంటుంది. ఇటీవల కొన్నిరోజులుగా నవీన్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులుకు గురిచేస్తున్నాడు. యువతి కొన్నిరోజులుగా అతగాడి వేధింపులు భరించలేక దూరంగా పెడుతుంది. ఇంతలో అతను రెచ్చిపోయి ఏకంగా కత్తులతో యువతి ఇంటికి వెళ్లాడు. అక్కడ యువతిని ఇష్టమున్నట్లు పొడిచాడు. అడ్డువచ్చిన తల్లిపై కూడా కత్తులతో దాడిచేశాడు. తల్లి రక్తపు మడుగులో పడి చనిపోయింది. అరుపులు, కేకలతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తల్లి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. యువతిపరిస్థితి సీరియస్ గాఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కత్తిపోట్ల ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

Read more: Waqf Bill: వక్ఫ్ బిల్లుపై జనసేన స్టాండ్ ఇదే.. కేంద్రానికి ఫుల్ పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్..

దీనిపై పోలీసులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదుచేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీహోంమంత్రి వంగల పూడి అనిత స్పందించారు. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై  వెంటనే జిల్లా ఎస్పీ శంఖభ్రత బాగ్చీతో మాట్లాడారు . యువతికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. నిందితుడ్ని వీలైనంత తొందరగా పట్టుకొవాలని ఆదేశించారు. బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు  నాయుడు భరోసా ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News