
Govt Employees Due Payments: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారుగా రూ.6,200 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్జి పెట్టుకుంటున్నారు. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయగా.. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది.
ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఉద్యోగులకు శుక్రవారం రోజున రూ.6.200 కోట్ల బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖను సీఎ చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో శుక్రవారం బకాయిల డబ్బులు జమ కానున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా సీపీఎస్, ఏపీజీఏఐ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ రూ.6,200 కోట్లు విడుదల చేయనుంది. అయితే ఇటీవల జనవరిలో రూ.1,033 కోట్ల బకాయిలను ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుతోపాటు పవన్ కల్యాణ్ భారీ హామీలు ఇచ్చారు. ఉద్యోగులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని నాడు ఎన్డీయే కూటమి ప్రకటించింది. ఉద్యోగులకు బకాయిలు చెల్లించడంతోపాటు అన్ని ప్రయోజనాలు సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లింపులు చేస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బకాయిలు విడుదల చేస్తుండడంతో ఉద్యోగులు సంబరాల్లో మునిగారు. ఉగాది ముందు ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు కానుక ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook