Dearness Allowance: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆగ్రహాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం త్వరలో వారికి తీపి వార్త వినిపించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిర్ణయం.. పెండింగ్ బిల్లుల కోసం నేడు భారీ ఉద్యమం
దీపావళి పండుగకు భారీ గిఫ్ట్ ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతున్నదని చర్చ జరుగుతోంది. ఆ ప్రకటన ఈనెల 10వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఉండనుందని తెలుస్తోంది. ఇటీవల సమావేశమైన ఏపీ మంత్రిమండలి ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే వారంలోనే మరోసారి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల అంశంపై చర్చ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: DA Hike: ఎవరికి ఎంత పెంపు ఉంటుంది? డీఏ గురించి టాప్ 10 హైలెట్స్ ఇవే!
దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కరువు భత్యం (డీఏ) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు నాలుగు డీఏలు బకాయి పడింది. దీనికి తోడు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ప్రకటించలేదు. ఏడాదికి రెండు డీఏలు చెల్లించాల్సి ఉండగా.. జూలైకి సంబంధించిన డీఏ బకాయి పడింది. ఇలా అన్నింటినీ పెండింగ్‌లో పెట్టడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహాన్ని పసిగట్టిన ప్రభుత్వం వారిని శాంతపర్చేందుకు దీపావళి ముందు ఒక డీఏ విడుదల చేస్తుందని చర్చ జరుగుతోంది. పదో తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Banks Holiday: ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్! ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేయాలని చూస్తుండగా ఉద్యోగులు మాత్రం రెండు డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగు డీఏలు పెండింగ్ ఉండడంతో రెండింటిని ఇవ్వాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రభుత్వం అసలు డీఏ ఇస్తుందా? అనేది కూడా ప్రకటన వచ్చే వరకు నమ్మశక్యం కానిది. పది తేదీ వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Schools Holiday: స్కూళ్లు, కాలేజీలకు 14 రోజులు సెలవులు.. బ్యాంకులకు కూడా!
పరిష్కరించాల్సిన డిమాండ్లు ఇవే..
==> 2024లో జరిగిన ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది.
==> కరువు భత్యం (డీఏ) వెంటనే విడుదల
==> వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ)
==> ఐఆర్, పెండింగ్ బిల్లులు సకాంలో చెల్లింపు
==> పాత పింఛన్ విధానం అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









