తిరుమలలొ రోడ్డుప్రమాదం; బస్సు బోల్తా, భక్తులకు గాయాలు

శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న సమయంలో తిమరుల ఘాట్ రోడ్డు వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకుంది

Updated: May 14, 2019, 05:18 PM IST
తిరుమలలొ రోడ్డుప్రమాదం; బస్సు బోల్తా, భక్తులకు గాయాలు

తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద వశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పటడంతో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు .. ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులను బయటికి తీశారు.  గాయపడ్డ వారికి చికిత్స నిమిత్తం  తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. 

తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌లో వెళుతున్న సమయంలో గాలి బీభత్సం ఉధృతంగా ఉండటంతో  ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. బలమైన గాలులు వీస్తున్న సమయంలో బస్సు అదపు చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో డివైడర్ ను ఢీకొన్న బస్సు..అదపుతప్పి 25 అడుగుల లోతులో పడిపోయింది.