)
Case File Against Director Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఒకపుడు భారత దేశం గర్వించే దర్శకుడు స్థాయి నుంచి పూర్తిగా తనను తాను డీ గ్రేడ్ చేసుకున్నాడు. ఒకపుడు ఆయన పై అభిమానం చూపించిన వాళ్లు.. ఆయన మాటలకు హర్ట్ అవుతున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ పై తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి లో కేసు నమోదు అయ్యింది. యాంకర్ స్వప్న చేసిన ఓ ఇంటర్ వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఆధారంగా త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో హిందూ ఇతిహాసాలు - దేవుళ్లు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను దూషించినట్లు ఫిర్యాదు అందింది.
యాంకర్ స్వప్న వివాదాస్పద ప్రశ్నలను రామ్ గోపాల్ వర్మ కోసం ఉద్దేశపూర్వకంగా అడిగారని ఫిర్యాదులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది మేడా శ్రీనివాస్ తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టే రామ్ గోపాల్ వర్మ వీడియోలు వెనుక విదేశీ టెర్రరిస్టులు ఉండొచ్చని ఆయన తన ఫిర్యాదు చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వ్యాఖ్యలను కేవలం హిందూ మతాన్ని ఉద్దేశించి చేస్తాడు. కానీ ఇతర మతాలపై ఒక్క మాటంటే ఒక్క మాట అనడు. అనే ధైర్యం వర్మకు లేదని హిందూ సంఘాలు చెబుతున్నాయి. హిందువుగా పుట్టి రాముడు, కృష్ణుడు పేరు పెట్టుకొని అదే మతంపై విషపు మాటలు మాట్లాడం ఏమిటనేది వాళ్లు సంధిస్తున్న ప్రశ్న. కేవలం హిందు మతాన్నే టార్గెట్ చేయడం వెనక ఆయనకు ఏదైనా విదేశీ శక్తి డబ్బులు ఇస్తున్నాయా.. అనే కోణంలో ప్రశ్నించాలన్నారు. అదే క్రిష్టియన్, ఇస్లామ్ మతాలపై ఒక మాట అనే ధైర్యం వర్మకు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం హిందు మతాన్ని టార్గెట్ చేస్తే ఎవరు పట్టించుకోరనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన లాంటి వ్యక్తులు చాలా మందికి హిందు మతం లోకువైపోయింది. ఇలాంటి వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎవడు అవాకులు, చవాకులు మాట్లాడానికి భయపడారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.