
EV Buses: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పీఎం ఇ బస్ సేవా పథకం త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు కానుంది. పట్టణ ప్రాంతాల్లో బస్సు సేవల్ని మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ పధకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కొత్త విద్యుత్ బస్సులు అందిస్తుంది. ఇందులో భాగంగా ఏపీకు 750 బస్లుులు రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ బస్ సేవా పధకంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెడుతోంది. మొత్తం 20 వేల కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా బస్సులు అందుబాటులో తీసుకొస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు కాంట్రాక్టర్ల ద్వారా వీటిని నడపనున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. ఏపీలో మొత్తం 11 నగరాలు ఈ పథకానికి అర్హత సాధించాయి. ఈ 11 నగరాల్లో మొత్తం 1050 ఎలక్ట్రిక్ బస్సుల్ని అందించనుంది. మొదటి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. పూణేకు చెందిన పిన్నాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది.
తొలి దశలో వస్తున్న 750 బస్సుల్లో 100 బస్సులు విశాఖపట్నంకు మంజూరు కాగా అందులో 50 సింహపురి డిపోకు, 50 గాజువాక డిపోకు కేటాయించారు. విజయవాడకు మరో 100 బస్సులు కేటాయించారు. గుంటూరుకు 100 బస్సులు, నెల్లూరుకు 100, కర్నూలుకు 50 బస్సులు వస్తున్నాయి. ఇక కాకినాడ, రాజమండ్రి, కడప, అనంతపురం డిపోలకు 50 బస్సుల చొప్పున మంజూరయ్యాయి. తిరుపతి, మంగళగిరి డిపోలకు చెరో 50 బస్సుల కేటాయించారు. ఈ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లను ఆయా డిపోల్లోనే ఏర్పాటు చేయనున్నారు.
ఈ బస్సుల్లో రెండు కేటగిరీలున్నాయి. ఒకటి 12 మీటర్ల పొడవు, మరొకటి 9 మీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. వీటిలో 9 మీటర్ల పొడవు ఉన్న బస్సులకు కిలోమీటర్‌కు 62.17 రూపాయల చొప్పున సదరు కాంట్రాక్టర్‌కు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇక 12 మీటర్ల పొడవు ఉన్న బస్సుకు కిలోమీటర్‌కు 72.55 రూపాయల చొప్పున ఆర్టీసీ చెల్లిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి