Amaravati Loans: అమరావతి రుణాలపై కేంద్రం గుడ్‌న్యూస్, ఏపీ పరిధిలో రావట

Amaravati Loans: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ముఖ్యంగా అమరావతి రుణాలపై క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2025, 08:10 PM IST
Amaravati Loans: అమరావతి రుణాలపై కేంద్రం గుడ్‌న్యూస్, ఏపీ పరిధిలో రావట

Amaravati Loans: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మంజూరైన రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి పొందుతున్న రుణాల పరిధి ఎవరిదో తేల్చిచెప్పింది. వైఎస్సార్ కాంగెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. 

Add Zee News as a Preferred Source

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కింద 2500 కోట్ల రుణాలు మంజూరు చేసింది. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌళిక వసతుల కోసం ఈ నిధులు మంజూరు చేసింది. ఇక అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి, అమరావతి సమ్మిళిత, సుస్థిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి 6,700 కోట్ల రుణాన్ని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రుణాల ఆమోదం, అగ్రిమెంట్ సంతకం విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ఈ రుణాలపైనే వైసీపీ ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్దిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. 

అమరావతి నిర్మాణం కోసం విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణాలేవీ ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిధిలో రావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రుణాలను ఏపీ అప్పుల పరిమితిలో లెక్కించకూడదని మంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రానికి అప్పులకు ఓ పరిమితి ఉంటుంది. అమరావతికి ఇస్తున్న రుణాలు మాత్రం ఆ పరిధిలో రావని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం అనుకున్నట్టుగా అమరావతి ప్రభుత్వ సముదాయంలో ముఖ్యమైన మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ రుణంతో పాటు ఇతర అంశాలు ఉపయోగపడనున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి వర్తించగా, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఫిబ్రవరి 10 నుంచి వర్తిస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10 శాతం మించకుండా గరిష్టంగా 1500 కోట్లను ప్రత్యేక సాయంగా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇదే కౌంటర్ పార్ట్ ఫండింగ్. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, షరతుల ప్రకారం కేంద్రం పర్యవేక్షణ ఉంటుంది.

Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు బిగ్ షాక్, ఈసారి 2 శాతమే పెరగనున్న డీఏ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News