close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఛలో ఆత్మకూరు రగడ; చంద్రబాబు హౌస్ అరెస్ట్‌తో వేడెక్కిక రాజకీయం !!

ఛలోఆత్మకూరుకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

Updated: Sep 11, 2019, 01:04 PM IST
ఛలో ఆత్మకూరు రగడ; చంద్రబాబు హౌస్ అరెస్ట్‌తో వేడెక్కిక రాజకీయం !!

అమరావతి: ఛలోఆత్మకూరుకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ టీడీపీ ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చింది. దీనికి పోటీగా వైసీపీ కూడా ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని డీజీపీ చెప్పడంతో టీడీపీ నేతలు గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని కలిసి అనుమతి కోరారు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిసి అనుమతి కోరారు.

చలో ఆత్మకూరు కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీయడంతో పోలీసులు దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు ఆత్మకూరు కు వెళ్తున్న చంద్రబాబును గృహ నిర్భంధం చేయచేశారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు తన నివాసంలోనే  12 గంటల నిరాహార దీక్షను మొదలు పెట్టారు. ఇదే సమయంలో  రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ఛలో అత్మకూరును పోలీసులు అడ్డుకోవడం పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యం ఉంటూ నిరసన కూడా తెలపకూడదా అంటూ ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని చంద్రబాబు పేర్కొన్నారు

ఇదే సమయంలో నారా లోకేష్‌ను కూడా పోలీసులు ఉండవల్లిలో చంద్రబాబు నివాసం బయట అడ్డుకున్నారు. దీంతో నారా లోకేష్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని అక్రమ అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. మరోవైపు చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్న నేతల్ని ఆరుబయటే అరెస్ట్ చేసి అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి అచ్చం నాయుడును చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది