)
Chandra Grahanam Effect Temples Closed: ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం. రాత్రి 9.50గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1.31గంటలకు వీడనుంది. రాహు గ్ర్త గ్రహణం భారత్ దేశం మొత్తం కనిపించనుంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3.30 గంటలకు మూసివేయనున్నారు. అక్కడి అన్నప్రసాద కేంద్రాలను సైతం మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ శ్రీవారి దర్శనానికి తక్కువ సమయం ఉండటంతో సుమారు 30వేల నుంచి 35వేల మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ తెలిపింది.
గ్రహణ సమయంలో అన్నవితరణ కేంద్రాలు మూసివేయడంతో.. భక్తులకు 50 వేల పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. రేపు గ్రహణం వీడాక ఆలయంలో శుద్ధి, పుణ్యహవచనం కార్యక్రమం చేసి సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరుచుకుంటాయన్నారు. సోమవారం వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను రద్దు చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు సర్వదర్శనం భక్తులు క్యూలైనులోకి రావాలని విజ్జప్తి చేశారు.
చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని విజయవాడ దుర్గగుడితో పాటు తెలంగాణలోని యాదాద్రి నరసింహా స్వామి, వేములవాడ రాజన్న ఆలయం, బాసర సరస్వతి ఆలయంతో పాటు చిన్నా, పెద్ద అన్ని ఆలయాలను కూడా మధ్యాహ్నం మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గగుడిని కవాట బంధనంతో మూసివేస్తారని ఈవో శీ తెలిపారు. వైదిక కమిటీ సూచనల మేరకు పౌర్ణమి రోజున ఉదయం నిర్వహించే గిరి ప్రదక్షిణ ఉదయం 5.55 గంటలకు యథాతధంగా నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం కవాట బంధనం చేసిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, లడ్డు, పులిహోర, అన్నప్రసాద తయారీ కేంద్రాలను కూడా మూసి వేస్తారన్నారు. 8న అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, హారతి అనంతరం సర్వదర్శనాన్ని ఉదయం 8:30 గంటలకు భక్తులను అనుమతిస్తారన్నారు. అటు యాదాద్రి సహా ఇతర ఆలయాల్లో సంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతులు ఇవ్వనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.