Kailasapatnam Fireworks: 'కైలాసపట్నం' ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Chandrababu And YS Jagan Shocked On Kailasapatnam Fireworks Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి 8 మంది మృతిచెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కైలాసపట్నం గ్రామంలో జరిగిన సంఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 13, 2025, 04:36 PM IST
Kailasapatnam Fireworks: 'కైలాసపట్నం' ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Kailasapatnam Fireworks Accident: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది మంది సజీవ దహనం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూనే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను హోంమంత్రి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: Rajiv Yuva Vikasam: లాభాలు వచ్చే వ్యాపారం చేయాలనేవారికి అద్భుత అవకాశం.. ఎల్లుండే ఆఖరి తేదీ

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకుని 8 మంది కార్మికులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. అగ్ని ప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు. ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు వివరించడంతో వారికి అత్యవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Also Read: RK Roja: మాజీ మంత్రి రోజాను 'ఆంటీ' అంటూ నోరు పారేసుకున్న సుడిగాలి సుధీర్‌

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భాంతి
అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని కైలాసపట్నంలో సంభవించిన బాణా సంచా అగ్నిప్రమాదంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. అగ్నిప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కార్మికులు మరణించడం, తీవ్రంగా గాయపడడం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయంగా నిలవాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులకు వైఎస్ జగన్‌ ఆదేశించారు.

ఇదొక దురదృష్టకర ఘటన: నారా లోకేశ్‌
కోటఉరట్ల ప్రమాదంపై హోం మంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడిన డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్. ప్రమాదంపై ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని నారా లోకేశ్‌ చెప్పారు. 'ఇదొక దురదృష్టకర ఘటన. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News