TDP Foundation Day: ఆవిర్భావ దినోత్సవం రోజు చంద్రబాబు సంచలన ప్రకటన.. జగన్‌కు భారీ షాక్‌

Chandrababu Sensational Announcement In TDP Foundation Day What Is What Know: పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గతాన్ని మొత్తం ఒకసారి నెమరువేసుకున్నారు. పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 29, 2025, 03:29 PM IST
TDP Foundation Day: ఆవిర్భావ దినోత్సవం రోజు చంద్రబాబు సంచలన ప్రకటన.. జగన్‌కు భారీ షాక్‌

Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు షాక్‌ ఇచ్చేలా కీలక ప్రకటన జారీ చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే మహానాడును ఈసారి జగన్‌ సొంత జిల్లా కడపలో నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వై నాట్‌ పులివెందుల, వై నాట్‌ కడప అనే ధోరణిలో చంద్రబాబు వ్యూహం నడుస్తోంది. ఈ క్రమంలోనే కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు.

Add Zee News as a Preferred Source

Also Read: YS Jagan In Iftar: అల్లా‌ చల్లని ఆశీస్సులు అందరికీ ఉండాలి.. ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం 60 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో  చెరగని ముద్ర వేసుకుందని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. 'ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలతో మనం ముందుకెళ్తున్నాం. పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా మందుంచాలనే లక్ష్యంతో ప్రజలే ముందు అనేలా పని చేస్తున్నాం' అని చంద్రబాబు వెల్లడించారు.

Also Read: Pastor Praveen: పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.. విచారణ చేయాలని డిమాండ్‌

ఎన్టీఆర్‌ ఆత్మగౌరవంతో..
తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించింది. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు. నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాను. రోజురోజుకూ టీడీపీ బలోపేతమవడానికి కార్యకర్తలే కారణం. పసుపు జెండా అంటే ఒక స్ఫూర్తి. డీపీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అన్న విధంగా తెలుగుజాతిని చూడాలి. మాజిక విప్లవాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకు అండగా నిలబడ్డాం. ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు రూ.2లకే కిలో బియ్యం, పెన్షన్, జనతా వస్త్రాలు, పక్కా ఇల్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆరే' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

'తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించడంతో పాటు మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో వాటా హక్కు కల్పించింది టీడీపీ. టెక్నాలజీని అందిపుచ్చుకుని అవకాశాలు సృష్టించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది మన తెలుగుజాతికి గర్వకారణం' అని చంద్రబాబు ప్రకటించారు.

'43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు.. సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడ్డామంటే దీనికి కార్యకర్తల త్యాగాలు, పోరాటేలా కారణం. 2019 తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బెదిరిపుంలు, అరెస్టులు వంటి చర్యలతో భయోత్పాతం సృష్టించిన కార్యకర్తలు జెండా వదల్లేదు. గొంతుపై కత్తిపెట్టి చంపుతామన్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారంటే...అలాంటి కార్యకర్తలు ఉండటం పార్టీకే గర్వకారణం' అని పార్టీ శ్రేణులపై ప్రశంసలు కురిపించారు.

'43 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది నాయకులను పోగొట్టుకున్నాం. పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప నాయకులను కోల్పోయాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. త్యాగాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదని.. ఏం చేసినా రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ కేడర్ నిలబడ్డారని చెప్పారు. ఈసారి మహానాడును కడపలో నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

'పేదలకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అంటుండేవారు. ఆ ఆశయ సాధనలో భాగంగానే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా బాగున్నవారు అట్టడుగున ఉన్నవారికి సహకారం అందించి పైకి తీసుకురావడం. కార్యకర్తలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలపడమే కాదు.. వారికి జన్మంతా రుణపడి ఉంటానని ప్రకటించారు. 'పార్టీ కుటుంబ పెద్దగా అండగా ఉంటా. కార్యకర్తలే టీడీపీకి శ్రీరామరక్ష.    తెలుగుదేశం బలోపేతం అవ్వడం అంటే రాష్ట్రానికి మంచి జరగడమే' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News