)
Hindu Temples: గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధికి.. ఆలయాల పునఃనిర్మాణానికి.. సీఎం చంద్రబాబు ఎన్నో దేవాలయాల పున్నర్ నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నట్లు దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ప్రకటించారు. ఎన్నో దేవాలయాల పున్నర్ నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా కోరితే దేవాలయాల పునర్నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ఏపీలోని తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరు శివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి ఆనం ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో 5,400 దేవాలయాలకు రూ.10 వేలు దీప ధూప నైవేద్యాలకు అందిస్తున్నట్లు దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు.
'ఎన్నో దేవాలయాల పున్నర్ నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్నాం. పామర్రు నియోజకవర్గంలో 16 ఆలయాలకు నిధులు మంజూరు చేశాం. ఇప్పటికీ 800 ఆలయాలకు పాలకవర్గాలను ఏర్పాటు చేశాం. నిన్న రాత్రి చివరగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశాం' అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. 'ఆలయాల్లో అర్చకులు, ప్రధాన అర్చకులు, ఆగమ పండితుల ఆలోచనల మేరకు పూజాధికాలు నిర్వహించాలి. ఆలయ కమిటీలు కానీ అధికారుల నిర్ణయాల మేరకు పూజా అధికాలు నిర్వహించకూడద్దని సూచించారు. ప్రతి ఏటా తొమ్మిది రోజులు నవ రాత్రులు నిర్వహించే వారం... 11 రోజులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. 'పామర్రు నియోజకవర్గంలోని ఆలయాలకు ఐదు కోట్ల నిధులు మంజూరయ్యాయి. పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో 25 చరిత్ర కలిగిన శివాలయం పునర్నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరయ్యాయి' అని వెల్లడించారు.
ఆలయాలకు నిధులు
పామర్రు మండలం జమీ గొల్లేపల్లిలో వేణుగోపాలస్వామి దేవాలయానికి రూ.97 లక్షలు
పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో దేవాలయానికి రూ.75 లక్షలు
తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెం లో కళ్యాణ మండపం నిర్మాణానికి రూ.50 లక్షలు
ఎస్సీ బీసీ కాలనీలలో దేవాలయాల నిర్మాణానికి శ్రీ వాణి ట్రస్ట్ నుంచి రూ.10 లక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook