)
SVSN Varma Promotion: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన అసెంబ్లీ స్థానాన్ని పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క పదవీ కూడా లభించకపోవడంతో ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా వర్మకు ఎమ్మెల్సీ కానీ.. మంత్రి పదవి కూడా లభించలేదు. పిఠాపురంలో ప్రాధాన్యం తగ్గుతుందని వర్మ వర్గం భావిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వర్మకు త్వరలోనే పదవి లభించనుందని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ప్రభుత్వం వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయించింది. వర్మకు గన్మెన్లను పంపించడంతో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లు గురువారం వర్మ వద్ద విధుల్లో చేరారు. దీంతో పిఠాపురంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే మంత్రివర్గంలో చోటు లభిస్తున్న సందర్భంగా భద్రతా సిబ్బందిని ప్రభుత్వం కేటాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీటు వదులుకున్న అనంతరం పవన్ కల్యాణ్ విజయం సాధించడమే కాకుండా డిప్యూటీ సీఎం కావడంతో పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు ప్రాధాన్యం దక్కడం లేదని చర్చ జరుగుతోంది. దీంతో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. అధికారం వచ్చినా కూడా తమకు ప్రాధాన్యం లేదని అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి ప్రభుత్వం తీపి కబురు అందించనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏ కార్యక్రమానికి వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో గుర్తింపు రావడం లేదని వర్మ వర్గం అసంతృప్తికి గురవుతోంది.
పిఠాపురంలో జరుగుతున్న వ్యవహారాలు వర్మను, టీడీపీని అవమానించేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం వర్మకు త్వరలోనే పదవి ఇవ్వనుందని చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఏర్పడడానికి పిఠాపురం స్థానం కీలక పాత్ర పోషించిందని చంద్రబాబు గుర్తించారు. వర్మకు ఏదైనా పెద్ద పోస్టు ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే గన్మెన్లను కేటాయించారని.. త్వరలోనే పదవి కూడా ఇవ్వబోతున్నారని టీడీపీతోపాటు ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గం ఆశాభావంతో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.