NT Rama Rao: 'మామ ఎన్‌టీ రామారావుకు మైక్ ఇవ్వకుండా అవమానించింది చంద్రబాబు కదా?'

History Never Forgot Chandrababu Insults To NT Rama Rao Says Kannababu: 'అసెంబ్లీ సమావేశాలను హాస్యస్పదంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోందని.. మామ ఎన్టీ రామారావును అవమానించింది చంద్రబాబు కాదా?' వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు కన్నబాబు ప్రశ్నించారు. కూటమిపై విరుచుకుపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 25, 2025, 08:34 PM IST
NT Rama Rao: 'మామ ఎన్‌టీ రామారావుకు మైక్ ఇవ్వకుండా అవమానించింది చంద్రబాబు కదా?'

AP Budget Session: 'అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రంలో సభా మర్యాదలు మంటగలపడం చంద్రబాబు తోటే ప్రారంభమైంది' వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ఆనాడు ఎన్‌టీ రామారావుకు మైక్ కూడా ఇవ్వకుండా అవమానపరిచారని నాటి సంగతులను గుర్తుచేశారు. గతంలో హరిచందన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో పేపర్లు చించేసి విజిల్స్ కూడా వేశారని మాజీ మంత్రి కన్నబాబు వివరించారు.

Add Zee News as a Preferred Source

Also Read: YS Sharmila: కొత్త సీసాలో పాత సారా మాదిరి ఏపీ గవర్నర్‌ ప్రసంగం.. మారని మాజీ సీఎం జగన్ తీరు

అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో సహా కూటమి సభ్యులు చేసిన ఆరోపణలు, విమర్శలపై మాజీ మంత్రి కన్నబాబు స్పందించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి నాయకులపై విరుచుకుపడ్డారు. 'పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్ సినిమాలో ఎవడిడప్పు వాడే కొట్టుకోవాలి అన్నట్టుగా చంద్రబాబు డబ్బా చంద్రబాబే కొట్టుకుంటున్నాడు' అని ఎద్దేవా చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులు నిరుద్యోగులైతే మళ్లీ మోసపోయామని రోడ్డుపై కూర్చుని వాళ్ల చెప్పులతో వాళ్లే కొట్టుకున్నారని కన్నబాబు గుర్తుచేశారు.

Also Read: DAs And GPF: 'ముఖ్యమంత్రి ఉద్యోగులకు డీఏలు, జీపీఎఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తారని ఆశించాం'

'గత ప్రభుత్వం అప్పులపై వందశాతం అబద్ధాలు చెప్పారు. తొమ్మిది నెలల కాలంలో మీరు చేసిన అప్పులు ద్వారా వచ్చిన డబ్బు ఏమైపోయింది? వాటితో ఏమి చేశారో చెప్పండి' అని మాజీ మంత్రి కన్నబాబు సవాల్‌ చేశారు. గవర్నర్‌తో గతంలో ఎవరూ ఇంతవరకూ చెప్పించనటువంటి విధ్వంసకరం వంటి మాటలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వైస్ ఛాన్సలర్లను బెదిరించి మీరు రాజీనామాలు చేయించి లేదా? గతంలో టీడీపీకి 30 ఎంపీ సీట్లు వస్తే మీకు పార్లమెంటులో ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు?' అని ప్రశ్నించారు. 

'మాజీ సీఎం వైఎస్‌ జగన్ అంటే భయంతో చంద్రబాబు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ అంటే మీకు భయం. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉంటే మిమ్మల్ని ఎండగడతారని మీకు భయం' అని వైసీపీ సీనియర్‌ నాయకుడు కన్నబాబు తెలిపారు. 'తొమ్మిది నెలల కాలంలో మీరు విఫలమయ్యారు. మీరు వచ్చిన తొమ్మిది నెలల కాలంలో మూడు లక్షల పెన్షన్లు పీకేశారు. దీపం పథకంతో గృహిణులును మోసం చేశారు. మీరు ఏ వర్గాన్ని వదలకుండా అందరినీ మోసగించారు' అని ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News