)
Andhra Pradesh Investments: దేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని.. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులకు సీఎం సూచించారు. పరిశ్రమలకు అనువుగా ఉండేలా లాజిస్టిక్ట్స్ను అభివృద్ధి చేస్తున్నామని.. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. సంపద సృష్టికి పెట్టుబడులు రావాలని.. సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలించగలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఢిల్లీలో మంగళవారం జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు హాజరై కీలక ప్రసంగం చేశారు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపొందిస్తే.. మేం స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామని.. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం అని ప్రకటించారు. దీని కోసం 10 సూత్రాలను ఆధారంగా చేసుకుని పని చేస్తున్నామని.. లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రాడెక్టు పర్ఫెక్షన్ లాంటి కీలకమైన లక్ష్యాలను పెట్టుకున్నట్లు వెల్లడించారు.
'పీ4 ద్వారా సమీకృత అభివృద్ధి సాధ్యం. స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్ సిటీలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. 2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుందని ప్రకటించారు. ఆ తదుపరి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను కూడా ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటామని.. 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీలోనే 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నామని.. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు. ఏపీ సులభతర వాణిజ్య విధానం అమలు చేయడంలో అగ్రస్థానంలో ఉందని.. సంస్కరణలు ఆలస్యంగా ప్రారంభించినా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నట్లు చెప్పారు. ఏపీ సోలార్, పంప్డ్ ఎనర్జీ, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టులు చేపట్టామని.. ఈ ప్రాజెక్టులతో దేశ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భారత కర్బన ఉద్గారాల రహిత ప్రయాణంలో కీలక భాగస్వామిగా ఏపీ ఉంటుంది.” అని ముఖ్యమంత్రి వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook