)
Pahalgam Terror Attack: ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం, ప్రజలు మీ వెంటే ఉంటారని మద్దతునిచ్చారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని చెప్పారు. పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు.
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి రావాలని ఆహ్వానం పలికారు. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని తెలిపారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు చెప్పారు.
పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు. భారతదేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించారు.
అమరావతికి ఆహ్వానం
మే 2వ తేదీన జరగనున్న రాజధాని పనుల పున:ప్రారంభానికి రావాలని ప్రధాని నరేంద్రమోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. అమరావతి పర్యటనకు వచ్చిన సమయంలో శ్రీశైలం కూడా సందర్శించాలని నరేంద్రమోదీని చంద్రబాబు కోరారు. ఈ క్రమంలోనే ప్రధాని, రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఎం చంద్రబాబుకు మోదీ పలు సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇందుకోసం మియావాకి విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబుకు మోదీ చెప్పారు. పనులు పున:ప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, ఆర్ఐఎన్ఎల్ గురించి ప్రధానమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీపీసీ, ఆర్సెలర్ మిటల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు మద్దతు, బీపీసీఎల్ రిఫైనరీ మంజూరు విషయంలోనూ ప్రధానికి ధన్యవాదాలు పేర్కొన్నారు. ఆరామ్కో భాగస్వామ్యాన్ని ఖరారు చేయడంతో అదనపు ప్రయోజనం కలుగుతుందని ప్రధానికి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe