Chandrababu naidu comments on banakacharla project: తెలంగాణ, ఏపీ ల మధ్య ప్రస్తుతం బనక చర్ల ప్రాజెక్ట్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఏర్పడిందే.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై అని తెలిసిందే. ప్రస్తుతం బనక చర్ల ప్రాజెక్ట్ వివాదంతో మరల రెండు తెలుగు స్టేట్స్ మధ్య అగాథం ఏర్పడిందని చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. బనక చర్ల ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల కోసం కలిసి రావాలన్నారు. దీని కోసం ఎంతదూరమైన వెళ్తామన్నారు.
ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లే విన్నా కూడా.. తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని వ్యాఖ్యలుచేశారు. అంతే కాకుండా.. ఒకవేళ తమకు అక్కడ కూడా న్యాయం జరక్కపోతే.. ప్రజల ముందు తెల్చుకుంటామన్నారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ..కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు.
ఏపీలో నిర్మిస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు తెలిపారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిలో నీరుపుష్కలంగా ఉందన్నారు. ఏపీ , తెలంగాణాలు వాడుకొవచ్చాన్నారు. అదే విధంగా కృష్ణానదిలో కూడా కొంత నీరుఉందన్నారు. అయితే.. సముద్రంలో కలిసిపోతున్న నీళ్లను వాడుకుంటే తప్పేంటని అన్నారు.
అనవసరంగా నీటిపై రాజకీయాలు చేయాలనుకొవడంలేదన్నారు. తెలంగాణలోను ప్రాజెక్ట్ లు కట్టాలి.. ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలన్నారు. కానీ ప్రాజెక్ట్ లపై రాజకీయాలు చేయడం మానుకొవాలని ఇరు రాష్ట్రాల నేతలకు చురకలు పెట్టారు.
బనక చర్లతో ఎవరికి నష్టంలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో తాము.. ఎప్పుడు కూడా గొడవపడలేదన్నారు. ఎవరి నీటిని వారు వాడుకునే హక్కు ఉందన్నారు. నీటి వినియోగం కోసం అవసరమైతే చర్చించుకుందమని చంద్రబాబు, రేవంత్ కు బిగ్ ఆఫర్ సైతం ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









