Swarnandhra Vision 2047: ప్రతి నియోజవర్గానికీ విజన్ డాక్యుమెంట్ రూపొందించి స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా అభివృద్ధి ప్రణాళికల అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రత్యేక అధికారిగా జిల్లా స్థాయి అధికారి నియమిస్తామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ సిద్ధం చేసినట్లు.. త్వరలో మిగిలిన వాటికి రూపకల్పన చేస్తామని వెల్లడించారు. త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దని చెప్పారు.
Also Read: Electricity Charges Decrease: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని.. తదనుగుణంగా ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన లఘు చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించి ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వాటికి ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టుగా ముందు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్టు వెల్లడించారు.
నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్‌ను సఫలీకృతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నామని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మండల, మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్‌ను గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా తీసుకుని అమలయ్యేలా చూస్తామన్నారు. జిల్లా విజన్ డాక్యుమెంట్ రూపొందించి కలెక్టర్ల సదుస్సులో విడుదల చేస్తామని.. ప్రతి చివరి వ్యక్తిని కూడా విజన్‌లో భాగస్వామిని చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలాగా పరిశ్రమలు తరిమేయడం కాకుండా తీసుకురావడం నేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
'నాడు 2020 రూపొందించాం. వికసిత్ భారత్ 2047 విజన్ కింద 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కాగా, తలసరి ఆదాయం 18 వేల డాలర్లు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించుకుని నిర్ధష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. 'రాయలసీమ రతనాల సీమగా మారుతోంది. సీమ హార్టికల్చర్ హబ్‌గా మారుతోంది. రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్రంగా మారుతుంది' అని తెలిపారు. పేదలను దత్తత తీసుకునే వారికి ప్రభుత్వం తరపున అవార్డులు, గుర్తింపు ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు.
2047 విజన్ అని చెప్పి, 20-30 ఏళ్ళ గురించి మాటలు చెప్పటం లేదు. ఆ లక్ష్యం సాధించటానికి ఇప్పటి నుంచే పని చేస్తున్నాం. ప్రతి ఏడాది ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకుని, దాని కోసం పని చేస్తున్నాం.… pic.twitter.com/r2EftmOk9q
— Telugu Desam Party (@JaiTDP) March 17, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









