AP Govt Holi Gift: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సీఎం చంద్రబాబు హోలీ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?

AP Govt Announced 20 Percent Additional Subsidy For PM SuryaGhar: హోలీ పండుగ వేళ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కానుక ఇచ్చారు. పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించి అదనపు రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 14, 2025, 12:00 AM IST
AP Govt Holi Gift: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సీఎం చంద్రబాబు హోలీ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?

PM SuryaGhar Scheme Subsidy: సహజంగా లభించే సౌర విద్యుత్‌ వినియోగానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రజలు సౌర విద్యుత్‌ వినియోగించుకునేందుకు అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఇదే క్రమంలో హోలీ పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఓ కానుక ఇచ్చారు. ముఖ్యంగా బీసీ ప్రజలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. సౌర విద్యుత్‌కు సంబంధించి పీఎఎం సూర్యఘర్‌ పథకం కింద అదనపు రాయితీ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

Also Read: JanaSena Party: జనసేన పార్టీ @ 13 ఏళ్లు.. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం ఇలా..

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు పలు కీలక ప్రకటన చేశారు. వాటిలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇప్పటికే భారీ రాయితీ ఇస్తోంది.

Also Read: Sikkolu Politics: ఏపీలో హోం మంత్రి మార్పు? పక్కా వ్యూహంతో సిక్కోలు నాయకుడి పావులు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం విశేషం. 2 కిలో వాట్ల సోలార్ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు రూ.1.20 లక్షలు వరకు ఖర్చవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీగా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీసీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలు అదనంగా రాయితీ అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం 2 కిలో వాట్ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్రం కూడా ఇచ్చే రాయితీతో కలిపి రూ.80 వేల వరకు సబ్సిడీ అందనుండడం విశేషం. బీసీ వర్గాలకు అండగా ఉండాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పీఎం సూర్యఘర్‌ పథకం పొందాలనుకునేవారు ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు. ప్రభుత్వ అధికారులను తెలుసుకుని ఈ పథకం లబ్ధి పొందవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News