)
Telugu Desam Party: అధికార తెలుగుదేశం పార్టీలో పదవుల జాతర జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా.. మరికొన్ని కీలక పోస్టులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 25 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించిన పార్లమెంట్ కమిటీల ప్రతిపాదనల కోసం ముగ్గురిని పరిశీలకులుగా నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్లమెంట్ కమిటీల ప్రతిపాదనల కోసం ముగ్గురిని పరిశీలకుల జాబితా విడుదల చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా నియమించిన వారు వీరే.
సమావేశాల తేదీలు
ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీల పరిశీలకుల సమావేశం తేదీలను కూడా టీడీపీ విడుదల చేసింది. 24వ తేదీ సమావేశం జరిగే పార్లమెంట్లు అనకాపల్లి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు ఉన్నాయి. 25 తేదీన అరకు, కాకినాడ. అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప, హిందూపూర్ పార్లమెంటరీ స్థానాల సమావేశం నిర్వహించనున్నారు. 26వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం పార్లమెంటరీ స్థానాల సమావేశాలు జరగనున్నాయని టీడీపీ వెల్లడించింది.
పార్లమెంట్ వారీగా సర్వసభ్య కమిటీ వివరాలు ఇలా..
అరకు (ఎస్టీ) – బందెలం అశోక్, బడేటి రాధాకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్
శ్రీకాకుళం - వంగలపూడి అనిత, నజీర్ అహ్మద్, కర్రొతు బంగార్రాజు
విజయనగరం - మహ్మద్ అహ్మద్ షరీఫ్, పీజీవీఆర్ నాయుడు (గన్నా బాబు), వాసంశెట్టి సుభాష్
విశాఖపట్నం – నిమ్మల రామానాయుడు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కుడిపూడి సత్తిబాబు
అనకాపల్లి – ఏలూరి సాంబశివరావు, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, డేగల ప్రభాకర్
కాకినాడ – కింజరాపు అచ్చెన్నాయుడు, అరిమిల్లి రాధాకృష్ణ, ప్రణవ్ గోపాల్
అమలాపురం – కొల్లు రవీంద్ర, జీవీ ఆంజనేయులు, గొట్టిముక్కల రాఘురామరాజు
రాజమండ్రి – పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కొలుసు పార్ధసారథి
నర్సాపురం – పొంగూరు నారాయణ, నుకసాని బాలాజీ, అనిమిని రవి నాయుడు
ఏలూరు – గొట్టిపాటి రవి, బుద్దా నాగ జగదీష్, ఎంఎస్ రాజు
మచిలీపట్నం – కాల్వ శ్రీనివాసులు, దామచర్ల సత్యనారాయణ, పీలా గోవింద సత్యనారాయణ
విజయవాడ – పయ్యావుల కేశవ్, బీటీ నాయుడు, పొలం రెడ్డి దినేష్ రెడ్డి
గుంటూరు – ఎన్ఎమ్డీ ఫరూక్, మద్దిపాటి వెంకట్రాజు, కిమిడి నాగార్జున
నరసరావుపేట – జ్యోతుల నెహ్రూ, కొనకళ్ల నారాయణ, మండలపు రవి
బాపట్ల – పంచుమర్తి అనురాధ, వీరంకి వెంకటగురుమూర్తి, మన్నే సుబ్బారెడ్డి
ఒంగోలు – గుమ్మిడి సంధ్యారాణి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కనపర్తి శ్రీనివాస్
నెల్లూరు – అనగాని సత్య ప్రసాద్, పులివర్తి వెంకట మణి ప్రసాద్, డూండి రాకేష్
తిరుపతి – మంతెన రామరాజు, ఎస్ సవిత, బుచ్చి రామ్ ప్రసాద్
రాజంపేట – ఆనం రామనారాయణరెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై. నాగేశ్వరరావు యాదవ్
చిత్తూరు – బీసీ జనార్ధనరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిల్లి మాణిక్యాల రావు
నంద్యాల – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవెలమూడి నాని, పూల నాగరాజు
కర్నూలు – నక్క ఆనందబాబు, బీకే పార్ధసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కడప – బీద రవిచంద్ర, బీవీ జయనాగేశ్వరరెడ్డి, నాదెండ్ల బ్రహ్మం చౌదరి
అనంతపురం – ఎన్. అమర్నాథ్ రెడ్డి, డా. డోలా బాల వీరాంజనేయస్వామి, మద్దిపట్ల సూర్యప్రకాశ్
హిందూపురం – దేవినేని ఉమామహేశ్వరరావు, టీజీ భరత్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.