)
Chandrababu naidu serious on woman tied video: ఆంధ్ర ప్రదేశ్ లోని చంద్రబాబు సొంత నియోజక వర్గమైన కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళని కూడా చూడకుండా.. ఆమెను సాటిమహిళలు చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు ఎస్పీతో మాట్లాడారు. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు.
Shocking #Kuppam, Chittoor
A loan shark with alleges ties to #TDP, tied a woman to a tree, beat & abused her over unpaid duesThe woman was assaulted by Munikannappa for her husband’s unpaid ₹80K loan
Police booked accused under multiple IPC sections#AndhraPradesh #crime pic.twitter.com/ZnBdnymdL5
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) June 17, 2025
అసలేం జరిగిందంటే.. కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమె భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం మునికన్నప్ప అనే వ్యక్తి నుంచి రూ. 80,000 అప్పుగా తీసుకున్నారు. అప్పటి నుంచి అప్పులు తీర్చకపొగా తప్పించుకుని తిరుగుతున్నారు.
ఏకంగా చెప్పపెట్టచేయకుండా ఊరువదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో శిరీష ఇటీవల తన కొడుకు టీసీ కోసం.. నారాయణ పురంకు వచ్చింది. దీంతో మునికన్నప్ప కుటుంబీకులు.. శిరీషను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. అంతటితో ఆగకుండా ఆమెను కొరడాతో కొడుతూ, బూతులు తిట్టారు.
ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. మహిళలపై దాడులు ఘటనపై మాత్రం పోలీసులు అలర్ట్ గా ఉండాలని, శాంతిభద్రతల సమస్యల విషయంలో నెగ్లీజెన్సీగా ఉంటే వదిలేదిలేదనిని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో కూటమి పాలనపై మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook