Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళల రక్షణకు శక్తి యాప్ తెచ్చాం. పోలీసులు అప్రమత్తంగా లేకపోతే చర్యలు. ఈగల్ వ్యవస్థతో గంజాయి, డ్రగ్ర్స్‌పై ఉక్కుపాదం మోపాం' అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలకు తావులేదని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో అసెంబ్లీలో బూతులు విన్నామని.. ఇప్పుడు ప్రజా సమస్యలపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: YS Sharmila: మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు యూటర్న్.. వైఎస్ షర్మిల ఆగ్రహం
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించమని, ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు స్వేచ్చగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని పరోక్షంగా వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండాపోయిందని తెలిపారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని చెప్పారు.
Also Read: Big Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్ కల్యాణ్ 'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు'
గత పాలకుల నిర్లక్ష్యంతో డ్రగ్స్, గంజాయి వాడకం విపరీతంగా పెరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయంపై దాడి విషయాన్ని స్పందిస్తూ.. 'మా కార్యాలయంపైనే దాడులు చేశారు. రాజకీయ పార్టీ కార్యాలయమంటే దేవాలయం. పార్టీ కార్యాలయాలపై దాడులు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. రాజకీయ కక్షసాధింపులకు నేను దూరంగా ఉంటా' అని సీఎం చంద్రబాబు వివరించారు. వ్యవస్థీకృతంగా మారిన గంజాయిసాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి పండించేందుకు వీల్లేదని.. ఆధునిక టెక్నాలజీతో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పని చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసేవారి తాట తీస్తామని హెచ్చరించారు. మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని.. ఆడబిడ్డలపై అత్యాచారాలకు ఒడిగడితే అదే వారికి చివరిరోజు అని సీఎం తెలిపారు. అత్యవసర పరిస్థితులు లేక ఆపదలో చిక్కుకున్నప్పుడు మహిళలు శక్తి యాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు... నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షిస్తారని వివరించారు. మహిళల భద్రత విషయంలో అప్రమత్తంగా లేకపోతే పోలీసులపైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దు. ఒక్క ఎకరాలో కూడా గంజాయి వేసినా చర్యలు తీవ్రంగా ఉంటాయి. గంజాయి, డ్రగ్స్‌పై చేస్తున్న యుద్ధం ఆపేదే లేదు. #APAssembly #OperationEagle #ChandrababuNaidu… pic.twitter.com/Xa1cbWMyrr
— Telugu Desam Party (@JaiTDP) March 11, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









