Chandrababu: చంద్రబాబు సంచలన నిర్ణయం.. బీజేపీ, జనసేన ఫుల్ హ్యాపీ..

  Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారా..! పార్టీలో చేరికల విషయంలో కొత్త రూల్ తీసుకువచ్చారా..! ఇకమీదట తెలుగుదేశం పార్టీలో చేరాలంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనా..! ఇన్నాళ్లు లేని రూల్‌ను సీఎం చంద్రబాబు ఇప్పుడెందుకు తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.    

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 12, 2025, 06:55 AM IST
Chandrababu: చంద్రబాబు సంచలన నిర్ణయం..  బీజేపీ, జనసేన ఫుల్ హ్యాపీ..

Chandrababu:ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక.. తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైయస్ఆర్సీపీకి  చెందిన చాలామంది లీడర్లు అధికార పార్టీలో చేరిపోయారు. ఇందులో జగన్ కోటరీ చూట్టూ ఉన్న నేతలు సైతం ఉన్నారు. అయితే వైసీపీలో చాలామంది లీడర్లు తెలుగు దేశం (TDP) చేరడంతో.. ఆ పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోయాయి. పలు జిల్లాల్లో టీడీపీ పాత నేతలు వర్సెస్‌.. వలస నేతలుగా సీన్‌ మారిపోయింది. ఇదే సమయంలో టీడీపీ నేతల వరుస హత్యల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. 

Add Zee News as a Preferred Source

ఇటీవల కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ మహానాడులో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తల హత్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరికలపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకమీదట తెలుగుదేశం పార్టీలో చేరాలి అంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్వర్వులు జారీ చేశారు. ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలి అనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసి ఆ తరవాత అనుమతి ఇచ్చిన తరవాత వారిని పార్టీలో చేర్చుకోవాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ ఇది గమనించాలని స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. చాలా మంది లీడర్లు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. వైసీపీ అధినేత జగన్‌కు షాక్ ఇస్తూ.. వీరంతా సీఎం చంద్రబాబు పక్కన చేరిపోయారు. అయితే అప్పటివరకు టీడీపీ గెలుపుకోసం పనిచేసినా నేతలు.. వీరి రాకతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వర్సెస్‌ కొత్తగా వలస వచ్చిన నేతలుగా సీన్‌ మారిపోయింది. ఈ గొడవలన్నీ పార్టీ హైకమాండ్‌ను ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. మరోవైపు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నేతల్లో చాలామంది జగన్ కోవర్టులు ఉన్నారని సీఎం చంద్రబాబు అనుమానిస్తున్నారట. ప్రభుత్వంలో తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు వెంటనే ప్రతిపక్ష పార్టీకి తెలిసిపోతున్నాయట. అందుకే పార్టీలో చేరికలపై అలర్ట్‌గా ఉండాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని హెచ్చరించినట్టు తెలుస్తోంది. 

మొత్తానికి తెలుగుదేశం పార్టీ కొత్త రూల్‌ తీసుకురావడంతో.. ఆ పార్టీపైనే ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీలో చేరికల విషయంలో ఇలాంటి రూల్ పెట్టడం ద్వారా చేరికలు ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కానీ టీడీపీ నిర్ణయం మాత్రం.. జనసేన, బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్దిరోజులుగా వైసీపీకి చెందిన మరికొందరు నేతలు టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఈ చేరికలు ఆగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి చేరికలు విషయంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా..! లేక చూసిచూడనట్టు వదిలేస్తారా అని తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందేనంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.

Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..

Also Read:  ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News