Welfare Schemes: ప్రజలకు భిక్షం మాదిరి కాకుండా సేవలా సంక్షేమ పథకాలు అందించాలి

Chandrababu Conference With Collectors: ప్రభుత్వ పథకాలను ప్రజలకు భిక్షం మాదిరి కాకుండా సేవలాగా అందించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 25, 2025, 07:51 PM IST
Welfare Schemes: ప్రజలకు భిక్షం మాదిరి కాకుండా సేవలా సంక్షేమ పథకాలు అందించాలి

AP Collectors Conference: ప్రజలకు సంక్షేమ పథకాలు సేవ మాదిరి అందించాలని.. భిక్షం వేసినట్టు చూడవద్దని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు హితవు పలికారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందించాలని ఆదేశించారు. సమాజంలో ఆర్థికంగా.. రాజకీయంగా.. సామాజికంగా వెనకబడిన బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సి ఉందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారు ఎవరూ ఉండకూడదని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Tax Payers: పన్ను చెల్లింపుదారులకు బంపర్‌ ఆఫర్‌.. 50 శాతం భారీ డిస్కౌంట్‌!

రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. పీ4లో భాగంగా సమాజంలో అట్టడుగున ఉన్న పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. డ్వాక్రా, మహిళా సంఘాల ద్వారా పేదలను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే నినాదం తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read: Petrol And Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ 17 రూపాయలు తగ్గించండి.. చంద్రబాబుకు వైఎస్‌ షర్మిల డిమాండ్‌

'ఐదేళ్లలో అదనంగా లక్ష ఎకరాల్లో అరకు కాఫీ సాగు విస్తీర్ణం పెంచుతున్నాం. కాఫీలో అంతరపంటగా వేసే నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, అవకాడో, యాపిల్, జీడి వంటి పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలి' అని సీఎం చంద్రబాబు సూచించారు. గిరిజన ఉత్పత్తుల పరిరక్షణకు అవసరమైతే డ్రోన్ టెక్నాలజీని వాడుకోవాలని చెప్పారు. ఎస్సీ సంక్షేమానికి ముందడుగు, బీసీల పురోగతికి ఆదరణ పథకాలను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ప్రస్తుతం ఆదరణ-3 పథకం ద్వారా ఆధునాతన టెక్నాలజీ, పరికరాలు సమకూరుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారు ఎవరూ ఉండకూడదని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వడ్డెరలకు క్వారీలు, మత్స్యకారులకు చెరువులు ఇచ్చేలా ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తున్నాం. వారికి జీఎస్టీ రద్దు చేశాం' అని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News