Kuppam Incident Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అనుమాషంగా మహిళను దాడి చేసిన సంఘటనపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించగా.. అంతేకాకుండా బాధితురాలికి భారీ సహాయం ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో సంఘటన జరగడంతో వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: YS Jagan: చంద్రబాబు దుర్మార్గపు పాలన ఫలితమే 'కుప్పం'లో మహిళ సంఘటన: మాజీ సీఎం జగన్
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషను సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడి శిరీషతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడగ్గా.. పలు సందర్భాల్లో తమను ఇబ్బందికి గురి చేశారని ఆమె వాపోయారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నట్లు చెప్పడంతో సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు.
Also Read: Samantha Loses Cool: 'హేయ్ ఇక ఆపుతారా?'.. ఫొటోగ్రాఫర్లపై సమంత ఆగ్రహం
'ఇలాంటి ఘటన దురదృష్ణకరం. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదు' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు బాధితురాలికి సీఎం వివరించారు. బాధితురాలి పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకుని వారిని బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని.. ధైర్యంగా ఉండాలని బాధితురాలికి భరోసానిచ్చారు.
అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆమెకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఫోన్‌లో బాధితురాలికి సీఎం హామీ ఇచ్చారు. ఘటన తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
త్వరలో వైఎస్ జగన్ పరామర్శ?
కాగా ఈ సంఘటన తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపింది. మొన్న పోలీసులు విచక్షణారహితంగా కొందరిపై బహిరంగంగా దాడికి పాల్పడగా.. తాజాగా టీడీపీ కార్యకర్తలు మహిళపై విరుచుకుపడడంతో ఏపీలో శాంతిభద్రతలపై ఆందోళన నెలకొంది. తాజా ఘటనను తీవ్రంగా పరిగణించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే బాధితురాలిని స్వయంగా పరామర్శించే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









