అన్ని చోట్ల గుజరాత్ ఫార్ములా పనిచేయదు - పశ్చిమ బెంగాల్ ఘర్షణపై చంద్రబాబు రియాక్షన్

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీలో చోటు చేసుకున్న ఘర్షణపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు

Last Updated : May 15, 2019, 06:59 PM IST
అన్ని చోట్ల గుజరాత్ ఫార్ములా పనిచేయదు - పశ్చిమ బెంగాల్ ఘర్షణపై చంద్రబాబు రియాక్షన్

అమిత్ షా ర్యాలీలో జరిగిన ఘర్షణ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా నిన్న కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించడం చూశాం. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం భారత దేశంలో ప్రజలందరికీ తెలిసిన విషయమేనని చంద్రబాబు పేర్కొన్నారు.

సీబీఐకి భయపడలేదనే ఈ దాడులు

సీబీఐ-ఈడీ, ఐటీలకు బయపడలేదని... ఏన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వారి బీ టీంలు గూండాలను నేరుగా రంగంలోకి తెచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతారు. మమతా బెనర్జీ గారికి సంఘీబావం తెలుపుతూ అమీత్ షా చర్యలను ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

గుజరాత్ ఫార్ములా అన్నిచోట్ల కుదరదు

ధర్మో రక్షిత రక్షిత అనే సూక్తి స్పూర్తికి విరుద్దంగా హింస ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్ లా మోదీ- షాలను నమ్మి మోయడానికి సిద్దంగా లేదని ఈ  సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

 

 

 

 

 

Trending News