)
Chandrababu Political Guru: నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారో తెలుసుకుందాం. అతడిని రాజకీయాల్లోకి ఎవరు ప్రోత్సహించారు? ప్రజా జీవితంలోకి ఎలా వచ్చారో తెలుసుకుందాం. తనను రాజకీయాల్లోకి ప్రోత్సహించిన టీచర్ ఎవరో అనే విషయాన్ని చంద్రబాబు స్వయంగా తెలిపారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
అమరావతిలోని సచివాలయం సమీపంలో గురువారం ఏర్పాటుచేసిన మెగా డీఎస్సీ టీచర్ల నియామక పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన జంధ్యాల అంజనీ ఓ ప్రశ్న వేశారు. 'నాయకత్వ ప్రయాణంలో మీకు స్పూర్తినిచ్చిన ఉపాధ్యాయుడి ఎవరు?' అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు బదులు ఇస్తూ.. 'డీఎల్ నారాయణ అనే ఎకనామిక్స్ ప్రొఫెసర్ నన్ను ప్రొత్సహించేవారు. రాజకీయాల్లోకి వెళ్తానంటే డీఎల్ నారాయణ నన్ను ప్రొత్సహించారు. యూనివర్సిటీ క్యాంపస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచా. విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే ఎంతటి కష్టమైన కార్యాన్ని అయినా సాధిస్తారు' అని తెలిపారు. 'ఇప్పుడు పరిస్థితి మారింది. హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేసే రోజులివి. ఏపీని నెంబర్-1 చేయాలి ఆ శక్తి టీచర్లల్లోనే ఉంది' అని చంద్రబాబు వివరించారు.
'మెగా డీఎస్సీపైనే తొలి సంతకం ఎందుకు పెట్టారు' అని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీచర్ ప్రశ్నించగా.. చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 'ఐదేళ్ల కాలంలో ఒక్క టీచర్‌ను కూడా నియమించలేదు. తొలిసారిగా సీఎం అయినప్పటి నుంచి విద్య పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టా. ఐటీ చదవమని ఆ రోజుల్లో చాలా మందికి చెప్పా. కొందరు నా మాటపై నమ్మకంతో పట్టణాలకు వచ్చి చదువుకున్నారు. ఆ రోజు చక్కగా చదువుకుని ఇప్పుడు విదేశాలకు వెళ్లారు.. బాగా స్థిరపడ్డారు' అని తెలిపారు.
'ముఖ్యమంత్రులందరూ ఎంతమంది టీచర్లను నియమించారో నేను ఒక్కడినే అంత మంది టీచర్లను నియమించా. విద్యా రంగాన్ని నేను ఎప్పుడూ అశ్రద్ధగా చూడలేదు. నిర్లక్ష్యం చేయలేదు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'మొదటి సూపర్ సిక్స్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు. దాంట్లో భాగంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశా. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేశారు' అని చెప్పారు. 'ఉద్యోగం సంపాదించాలన్న మీ కోరిక తీరింది.. పేదరికం లేని సమాజం చూడాలనేది నా కోరిక. పేదరికం లేని సమాజాన్ని చూడాలంటే.. విద్యతోనే సాధ్యం.. దాన్ని మీరే నెరవేర్చాలి' అని సీఎం చంద్రబాబు వివరించారు.
'మగవారి కంటే మహిళలే ఎక్కువగా చదువు చెప్పగలరు. టీచర్లుగా బాధ్యతలు తీసుకున్న మీరంతా బాగా పని చేయాలి. మంచి పేరు తీసుకురావాలి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా టీచర్లంతా పని చేయాలి' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook