)
Nara Lokesh Promotion: ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నారా లోకేష్ కు సీఎం సీటులో కూర్చోబెట్టేందుకు రంగం సిద్దమవుతున్నట్టు సమాచారం. కొద్దిరోజులుగా ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏపీ కేబినెట్ సమావేశాల్లోనూ లోకేష్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అన్ని శాఖలపై లోకేష్ పట్టు సాధిస్తున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్లకుండా లోకేష్ నే హస్తినకు పంపిస్తున్నారు. అక్కడ ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలు, అమరావతి, పొలవరం ప్రాజెక్టులకు నిధులు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు రాష్ట్రానికే పరిమితం అయినా లోకేష్.. ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పడంపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు 75 ఏళ్లు దాటింది. ఆయనకు సీఎంగా ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది.. కానీ చంద్రబాబు రిటైర్ మెంట్ తీసుకుని లోకేష్ ను త్వరలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఇదే కరెక్ట్ టైమ్ గా భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది.. తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు జనసేన, బీజేపీలో కలిపి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అటు ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం మిగిలి ఉంది. ఆలోపే నారా లోకేష్ కు సీఎం సీటులో కూర్చోబెడితే.. ఆయన ఫొలిటికల్ లైఫ్‌కు ఎలాండి ఢోకా ఉండదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఎందుకంటే వచ్చే నాలుగేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అంచన వేయలేని పరిస్థితి. ఓ వైపు జగన్.. మరోవైపు నుంచి జనసేన అధినేత సీఎం సీటు కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ అయితే మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ప్రకటిస్తున్నారు.. కానీ ఆయన్ను సీఎం సీటులో కూర్చోవాలంటూ జనసేన నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఏమైనా మారితే.. లోకేష్ కు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు.. ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కొద్దిరోజులుగా లోకేష్ ను చంద్రబాబు బాగా ప్రమోట్ చేస్తున్నారని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఐటీ, విద్యా శాఖమంత్రిగా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా అన్ని మంత్రిత్వ శాఖలపై పట్టు సాధిస్తున్నారు. సీఎం చంద్రబాబు అందుబాటులో లేని సమయంలో అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు. అటు రాష్ట్రానికి కేంద్రం నుంచి దక్కాల్సిన వాటా, పనులు, కొత్త ప్రాజెక్టుల కోసం ఢిల్లీ టూర్ లు చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో సీఎం చంద్రబాబు లోకేష్ కు ఎక్కువ ప్రీడమ్ ఇవ్వలేదు.. కానీ కొద్దిరోజులుగా ఆయనే లోకేష్ ను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో లోకేష్ ను సీఎం చేసేందుకే ఇదంతా చేస్తున్నారని చెబుతున్నారు. దీనికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. గతంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో కేటీఆర్ ను సీఎం చేయాలనే డిమాండ్ ఉండేది. కానీ కేసీఆర్ మాత్రం.. పదేళ్లు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు. దాంతో కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక కల గానే మిగిలింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు సీఎం సీటులో ఎవరూ కూర్చుంటారు అనేది కూడా ఉత్కంఠగా మారింది.
మరోవైపు వైఎస్ జగన్ మాత్రం.. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.. వైఎస్ మరణం తర్వాత.. కొత్తగా వైసీపీని స్థాపించారు. 2019 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీని ఓడించి సీఎం సీటులో మరోసారి కూర్చోవాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవరికి ఇవ్వాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఆలోపు నారా లోకేష్ ను సీఎం సీటులో కూర్చోబెడితే.. పొలిటికల్ లైఫ్ కు ఎలాంటి టెన్షన్ ఉండదని సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందని తెలుస్తోంది. అందుకే వీలైనంత త్వరగా నారా లోకేష్ ను సీఎం సీటులో కూర్చోబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. అవసరమైతే ఈ విషయంలో ప్రధాని మోడీని ఒప్పించాలని యోచిస్తున్నారట. అయితే నారా లోకేష్ కు సీఎం పదవి ఇస్తే జననసేన అధినేత ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. లోకేష్ కు సీఎం పదవిని పవన్ అంగీకరిస్తారా.. అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.