YS Jagan Child Fan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది. వైసీపీ లీడర్ వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమంటోంది. విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ సమయంలో జగన్‌ను చుట్టుముట్టిన జనం.. ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి.. జగన్‌ను కలిసేందుకు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన వైఎస్ జగన్ ఆ చిన్నారిని అక్కున చేర్చుకుని ముద్దాడారు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పుడు ఇదే వీడియోపై నెట్టింట తెగ ట్రోలింగ్ జరుగుతోంది.
Also Read: Nara Lokesh Pic Viral: క్రికెట్ మ్యాచ్‌లో నారా లోకేశ్.. ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం
తొలుత వైఎస్ జగన్- చిన్నారి దేవికా రెడ్డి వీడియోను జగన్ అనుకూల మీడియా తెగ ట్రోలింగ్ చేసింది. మరో చిన్నారి మహితారెడ్డి కూడా తనకు అమ్మ ఒడి రాలేదని చెప్పింది. అంతేకాదు ఇప్పుడు జగన్ మామయ్య ముఖ్యమంత్రిగా ఉండి వుంటే అమ్మ ఒడి వచ్చేదని తెలిపింది. పదేపదే వైసీపీ మీడియాలో జరిగిన ఈ ప్రచారంపై డిప్యూటీ స్పీకర్ ఆర్‌ఆర్‌ఆర్ స్పందించారు. ఈ కామెంట్‌తో మొదలైన వార్‌ను తెలుగుతమ్ముళ్లు కంటిన్యూచేస్తున్నారు.
Also Read: Ration Rice: సీజ్ ది షిప్ ఫెయిల్యూర్.. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
మహానటి సావిత్రిని తలదన్నేలా ఏడుపు సీనును పండించిన ఆ చిన్నారి రెడ్డమ్మకు బంగారు నంది అవార్డు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఫాలోవర్లు అంటున్నారు. ఆ చిన్నారుల్లో ఎంత టాలెంట్ లేకపోతే.. ఎన్ని రోజులు రిహార్సల్ చేయకపోతే.. అలా జీవించగలుతారని ప్రశ్నిస్తున్నారు. ఇక సినిమాల్లో కనిపించే రెగ్యులర్ చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈర్ష్యపడే స్థాయిలో, అలవోకగా నటనలో జీవించారంటే.. ఆ చిన్నారి రెడ్డమ్మలకు కచ్చితంగా ఆస్కార్ రావాల్సిందే అని మరికొందరు అంటున్నారు. ఇలాంటి వారికి స్వయంగా జగనన్నే ఆస్కార్ జ్యూరీకి ఓ సిఫార్సు లేఖ రాస్తే ఆ బాలనటులకు అవార్డు దక్కుతుందని అంటున్నారు.
Also Read: Ration Rice: సీజ్ ది షిప్ ఫెయిల్యూర్.. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
మరోవైపు గతంలోనూ జగన్ ఇలాంటి డ్రామాలతో రాజకీయాల్ని రక్తి కట్టించారని మండిపడ్డారు. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కూడా ఉత్తుత్తిదేనని చెప్పుకొచ్చారు. అనంతరం గత ఎన్నికల ప్రచారంలో జగన్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ తలకు తీవ్ర గాయమైంది. ఆ గాయంలోనే జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు దేవిక ఏపిసోడ్ ఇవన్నీ కూడా జగన్ రాసుకున్న స్క్రిప్టులను టీడీపీ నేతలు అరోపిస్తున్నారు. ఐ ప్యాక్ టీమ్ ఎలా చెబితే. జగన్ అలాగే నడుచుకుంటారని నేతలు ఆరోపించారు. అంతేకాదు.. భద్రత విషయంలోనూ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జగన్‌కు ఎక్కడా భద్రత తగ్గలేదని చెప్పుకొచ్చారు. అటు చిన్నారి దేవిక ఏపిసోడ్ కూడా పెద్ద డ్రామాగా అభివర్ణించారు.
ఇక టీడీపీ నేతల విమర్శలకు అంతేధీటుగా వైసీపీ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు. గతంలోనూ టీడీపీ సోషల్ మీడియా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో వివరించే ప్రయత్నం చేశారు. గతంలో ప్రభుత్వ స్కూల్‌లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారని గుర్తు చేశారు. అటు జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారని మండిపడ్డరాఉ. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశారని తెలిపారు. ఇప్పాడు చిన్నారి దేవిక విషయంలో ఇదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాలనలో మహిళలతో పాటు చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ చిన్నారి వైఎస్ జగన్ ను కలిస్తే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. చిన్నారిపై తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన విద్యార్థిని దేవికా రెడ్డిపై టీడీపీ నేతలు సైకోల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే దేవికపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న చంద్రబాబు పవన్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
మొత్తంమీద చిన్నారి దేవిక విషయంలో అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం చేస్తున్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. దీంతో ఎవరి వాదన కరక్టో తెలియక నెటిజన్లు తెగ పరేషన్ అవుతున్నారు.. మరోవైపు రెండు పార్టీల సోషల్ మీడియా వార్ ఇంకెంత దూరం వెళ్తుందోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









