)
Ci Shankaraiah sends legal notice to ap cm Chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో అధికార కూటమి ప్రభుత్వం.. గత వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తుంది. అంతేకాకుండా అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు కూడా తీసుకొవడం ఎందుకని కూటమి నేతలు వైసీపీ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలో అధికార, అపోసిషన్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
అయితే.. గతంలో మాజీ మంత్రి వైఎస్ వివేక నందరెడ్డిమర్డర్ మిస్టరీ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో వివేక హత్య జరిగిన సమయంలో.. పులివెందులకు సీఐగా ఉన్న శంకరయ్య తాజాగా... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపడం ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.
గతంలో చంద్రబాబు తనపై ఈ కేసులో నిరాధర ఆరోపణలు చేశారని శంకరయ్య తన లాయర్ తో ఈ నెల 18న నోటీసులు పంపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సెషన్ లో చంద్రబాబు తనకు క్షమాపణలు చెప్పాలని అదే విధంగా తన పరువుకు భంగం కల్గించినందుకు 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నాడు.
శంకరయ్య ఎవరంటే..?..
మాజీ మంత్రి వైఎస్ వివేక నందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా జే. శంకరయ్య ఉన్నారు. అయితే.. తొలుత హర్ట్ ఎటాక్ అని ఆతర్వాత గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలి వేటుల వల్ల వివేక హత్యకు గురయ్యారని వార్తలు వచ్చాయి. అదే విధంగా అప్పటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మొదలైన వారి ఒత్తిడి వల్ల తొలుత కేసులుపెట్టకుండా, ఘటన ప్రదేశాన్ని శుభ్రం చేయడం, ఆధారాల్ని మరుగున పర్చే విధంగా సీఐచేశారని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో గత ప్రభుత్వం సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా.. 2021 అక్టోబర్ 6న సస్పెన్షన్ ను ఎత్తివేసింది.
తొలుత డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు పంపవద్దని, గాయాలు ఉన్నాయని ఎవరికి చెప్పవద్దని తనపై ఒత్తిడి వచ్చిందని సీఐ సీబీఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.కానీ మేజిస్ట్రేమ్ ముందు మాత్రం చెప్పడానికి రాలేదు. నిందితులు ప్రభావితం చేయడం వల్ల సీఐ శంకరయ్య మాటమార్చాడని,వాయిదా వేసుకుంటూ వస్తున్నారని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.