CII Partnership Summit in Vishakapatnam: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ నిర్వహించనుంది. అందుకోసం విశాఖపట్నం సన్నద్ధం అయ్యింది. ఈ సదస్సును సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీని కోసం అధికార యంత్రాగాన్ని సన్నద్ధం చేయడం సహా ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అని సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి సంకల్పించారు.
ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఆటోమొబైల్స్, టూరిజం, డిఫెన్స్ రంగాల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ప్రధానంగా ఏపీ ప్రభుత్వం చూస్తోంది. దీంతో పాటు వైజాగ్‌లోని భారత తూర్పు తీరంలో గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక రచిస్తున్నారు.
Also Read: OnePlus 15: రేపే మార్కెట్లోకి OnePlus 15 మొబైల్ విడుదల..అతితక్కువ ధరతో అదిరిపోయే ఫీచర్స్!
వైజాగ్‌లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా ఈ సీఐఐ సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.
బుధవారం అనగా నవంబరు 12న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్న అనంతరం ఇండియన్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కల్యాణి సమావేశం అయ్యి.. భాగస్వామ్య సదస్సుపై అధికారులతో సమీక్షించనున్నారు.
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం..
సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సదస్సులో పాల్గొనేందుకు సింగపూర్, యూకే, యూఏఈ వంటి దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









