Simhachalam Tragedy: సింహాచలం ఘటనలో సీఎం చంద్రబాబే దోషి.. వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Ex CM YS Jagan Fire On Chandrababu Simhachalam Incident: సింహాచలం ప్రమాద ఘటనకు చంద్రబాబు నాయుడే దోషి అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని.. అయినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 30, 2025, 07:21 PM IST
Simhachalam Tragedy: సింహాచలం ఘటనలో సీఎం చంద్రబాబే దోషి.. వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Simhachalam Temple Tragedy: చందనోత్సవం సందర్భంగా ఏర్పాట్లలో చంద్రబాబు నాయుడు తీవ్ర నిర్లక్ష్యం చేశారని.. దాని ఫలితమే గోడ కూలడం అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. సింహాచలం ఘటనలో చంద్రబాబు దోషి అని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తోందని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ, గోశాలలో గోవులు, శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి, తిరుపతి తొక్కిసలాట అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Indus Waters Treaty: సింధు నది జలాల ఒప్పందం ఏమిటి? టాప్ 10 ముఖ్యాంశాలు ఇవే!

సింహాచలం వరాహా లక్ష్మీనరసింహా స్వామి ఆలయం చందనోత్సవం వేళ గోడ కూలి ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మృతిచెందిన కుటుంబాలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వైకుంఠ ఏకాదశి రోజు ఇలాగే చేశారు. తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా?' అని ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ కూడా నిర్లక్ష్యం వహించారని.. కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు.

Also Read: CM Chandrababu: పది నెలల పాలనలో సీఎం చంద్రబాబు ఫెయిలయ్యారా? పాసయ్యారా?

'ఆరు రోజుల కిందట గోడ కట్టడం ఏమిటి? రెండు రోజులకే పూర్తి చేయడం ఏమిటి?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. చందనోత్సవంపై ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని.. కొత్తగా కట్టిన గోడ పక్కనే క్యూలైన్‌ ఎందుకు పెట్టారని నిలదీశారు. రాజకీయాల కోసం తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేయడంతో తొక్కిసలాట జరిగి ఏడుగురు మరణించారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఏ ప్రమాదం సంభవించినా అన్నింటిలోనూ చంద్రబాబు దోషి అని ప్రకటించారు.

'సింహాచలం ఘటనను మాపైకి నెట్టే ప్రయత్నం చేశారు. కానీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా కూడా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు' అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలని హితవు పలికారు. మృతుల కుటుంబాలకు భారీగా పరిహారం ఇవ్వాలని.. ఆ కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున ఆదుకుంటామని ప్రకటించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. తప్పకుండా ఆ బాధితులకు న్యాయం చేస్తామని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News