close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

మరో చారిత్రక ఘట్టం ; ఉత్తరాంధ్రను సశ్య శ్యామలం చేసే సుజల ప్రాజెక్టుకు శంకుస్థాపన

                     

Updated: Nov 15, 2018, 09:20 PM IST
మరో చారిత్రక ఘట్టం ; ఉత్తరాంధ్రను సశ్య శ్యామలం చేసే సుజల ప్రాజెక్టుకు శంకుస్థాపన

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరిన్ని మంచి రోజులు రానున్నాయి. ఆ ప్రాంతాన్ని సశ్య శ్యామలం చేసే ప్రతిష్ఠాత్మక సుజల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 'బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' పేరుతో  ఈ ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే  ఉత్తరాంధ్ర ప్రాంతంలోని లక్షా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ముఖ్యంగా ఇది విశాఖ జిల్లాకు  ఎంతగానో ఉపయోగపడే ప్రాజెక్టు అని అధికారులు పేర్కొన్నారు.

నీటి కష్టాలకు పరిష్కారం - బాబు

సుజల ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-1ను వీలైనంత త్వరగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2019 మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ నెలలోనే గోదావరి, పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామని తెలిపారు. నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే ఏపీకి శాశ్వతంగా నీటి కష్టాలు ఉండవని.. ఆ దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియ కొనసాగిస్తూనే ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.