Chadrababu Naidu Comments On YS Jagan: తన రాజకీయ జీవితంలోనే అత్యంత భయంకర జీవితాన్ని చూశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుర్తుచేసుకున్నారు. తనను కనీసం ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని స్థితిని కల్పించారని, తనను జైలుపాలు చేశారని వాపోయారు. హెలికాప్టర్లో జగన్ పయనిస్తుంటే, భూమి మీదున్న చెట్లను నరికేయడం తన జీవితంలో మొట్టమొదటి సారి చూసినట్లు చెప్పుకొచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటరు జిల్లా పొన్నెకల్లులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. జగన్ హాయంలో జరిగిన అరాచకాన్ని వదిలించుకునేందుకే తెలుగుదేశం పార్టీకి 94 స్థానాలు ఇచ్చారని, జగన్‌ను 11 స్థానాలకు పరిమితం చేసి చావు దెబ్బకొట్టారని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలోనే అత్యంత సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రస్తుతం నడిపిస్తున్నామని, ప్రజలకు మంచి చేసేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ పుట్టిననాటి నుంచే దళిత సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలచిందని, పార్లమెంట్ చరిత్రలోనే స్పీకర్ గా బాలయోగిని నియమించామని గుర్తుచేసుకున్నారు. దళితులకు ఎటువంటి సమస్య రాకూదని, ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశానని, సొంత ఊరిలోనే ఉండి ఎదగాలని సూచించారు. అమరావతికి అనేక సంస్థలు, విద్యాలయాలు తరలి వస్తున్నాయని, ఇక్కడే అనేక అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ను అందిస్తున్నామ, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు మంచి భోజనం, వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి సబ్ ప్లాన్ నుంచి ప్రతి నెలా రావాల్సిన బకాయిలను ఇస్తున్నామని, ఏ స్కీం కూడా ఆగడం లేదని వెల్లడించారు.
అంబేద్కర్ విద్యాదీవెనను మళ్లీ ప్రారంభిస్తాం..
జగన్ హాయంలో ఆగిపోయిన అంబేద్కర్ విద్యాదీవెన పథకాన్ని త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని, విదేశీ చదువులు దళిత విద్యార్థులకు మేడిపండులా ఉండకూడదని చెప్పారు చంద్రబాబు నాయుడు. జగన్ హాయాంలో కొద్దిమందికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించిందని, తాము ప్రారంభించబోయే పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ స్కీమ్ కింద డబ్బులు అందిస్తామని, దాంతో విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి ఆస్కారం లభిస్తుందని వెల్లడించారు. విజన్ 2047 లక్ష్యంగా తాము అందరం సన్నద్ధం అవుతున్నామని, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా మార్చడం కోసం పెద్ద ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం కోసం పీ4 ప్రణాళికను రచించామని, దీంతో రాష్ర్టంలో పేదరికం తగ్గుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా పోన్నెకల్లులో పీ4 ప్రాజెక్టులో లబ్ధిపొందిన కుటుంబాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పొన్నెకల్లులో ఇంకా 300 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని, త్వరలోనే వాటిని నిర్మించి ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివీద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ చిత్రపటాల మాలికను తిలకించారు.
Also Read: Telangana SC Reservation: నేటి నుంచి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ అమలు.. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం..
Also Read: Telangana Rains: అకాల వర్షంతో అంతా ఆగమాగం.. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









