Chandrababu: వేసవిపై సీఎం చంద్రబాబు అలర్ట్‌! అధికారులకు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Review On Summer 2025 And Key Orders To Officers: ఉష్ణోగ్రత్తలు పెరుగుతుండడం.. ఎండ వేడిమి తీవ్ర రూపం దాలుస్తుండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ప్రజలు, రైతులతోపాటు పశువులకు తాగు, సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 24, 2025, 06:22 PM IST
Chandrababu: వేసవిపై సీఎం చంద్రబాబు అలర్ట్‌! అధికారులకు కీలక ఆదేశాలు

Summer 2025 Safety Tips: ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని.. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పశువుల కోసం గ్రామాల్లో నీటితొట్ల నిర్మాణం.. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని కోరారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి.. డ్రోన్లతో పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: TTD Board Meeting: తిరుమలలో 'వీఐపీ సంస్కృతికి' బ్రేక్‌? టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే!

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడుతుండగా.. పంటలు దెబ్బతినడం.. తాగునీటితోపాటు సాగునీటి కొరతపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వేసవికాలం ప్రారంభమవడంతో రాష్ట్రంలో పరిణామాలు, స్థితిగతులపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు.. తాగు, సాగునీరు కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: YS Jagan: 'మూడేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే': మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం నిర్ధిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని.. దానికనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పశువులపై..
ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలెర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలిపి జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ముందు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించవచ్చన్నారు. ప్రభుత్వపరంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పశుగ్రాసం కొరతతో పాటు పశువులకు తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మించాలని చెప్పారు. వేసవిలో పశువులు, పక్షుల దాహాన్ని తీర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News