)
North Andhra Heavy Rains: ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షాలు పడడంతో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలకు గురయ్యారు. దసరా పండుగ రోజు ప్రజలు అవస్థలు పడ్డారు. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పు పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులతో కీలక సమీక్ష చేశారు.
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో గురువారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం పరిస్థితులను అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ.. అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని.. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook