Secretariat Fire Accident: రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లోని రెండో అంతస్తులో ప్రమాదం సంభవించగా వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదంతో సచివాలయంలో పొగలు వ్యాపించగా.. గోడలు నల్లగా మారాయి.
Also Read: YS Sharmila: 'మోదీ, బాబు, జగన్, పవన్ కలిసి ఏపీకి తీరని ద్రోహం': వైఎస్ షర్మిల
అగ్నిప్రమాద ప్రదేశాన్ని మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి పరిశీలించి ప్రమాద తీరును తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో కూడా మాట్లాడారు.
Also Read: YS Sharmila: 'వైఎస్ అవినాశ్ రెడ్డి జైలులో ఉండాలా? బయట ఉండాలా?'
పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు సచివాలయ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని సీఎం అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిందీ లేనిది అడిగి తెలుసుకున్నారు.
సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండో బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అక్కడి నుంచి సీఎంఆర్ఎఫ్ విభాగానికి వెళ్లి అక్కడ పరిశీలించారు. అపరిశుభ్రత ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం 24 గంటల్లో చెత్తనంతా శుభ్రం చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని స్పష్టం చేశారు. కాగా ఈ ప్రమాదంపై జీఏడీ, సీఆర్డీఏ శాఖలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నాయి. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఇచ్చే నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









