close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

హలో సార్ వెల్ కమ్.. కొత్త గవర్నర్‌కు ఫోన్ లో పలకరించిన సీఎం జగన్

ఏపీకి కొత్తగా నియమితులైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ కు సీఎం జగన్ ఫోన్ లో మర్యాదపూర్వకంగా పలకరించారు.

Updated: Jul 17, 2019, 01:20 PM IST
హలో సార్ వెల్ కమ్.. కొత్త గవర్నర్‌కు ఫోన్ లో పలకరించిన సీఎం జగన్

ఏపీ గవర్నర్ గా  నరసింహన్ స్థానంలో ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ను నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ ఫోన్ చేసి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన జగన్... తమ రాక కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నట్లు కొత్త గవర్నర్ తో  అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి గవర్నర్ విచ్చేయుచనున్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కు రాష్ట్రాభివృద్ధికి  సంపూర్ణ సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీకి నూతన గవర్నర్ నియమాకం జరగడంతో నరసింహన్‌ తెలంగాణకు మాత్రమే పరిమితం కానున్నారు.