YS Sharmila VS Jagan: కన్నతల్లితో పాటు నా బిడ్డలకు ద్రోహం.. జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడిన వైఎస్ షర్మిల..

Ys Sharmila Fires on Jagan: వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కన్నతల్లితో పాటు, తన పిల్లల్ని సైతం జగన్ మోసం చేశారని ఎద్దేవా చేశారు. జగన్ చరిత్ర హీనుడుగా మిగిలి పోతాడన్నారు. ఈ క్రమంలో షర్మిల వ్యాఖ్యలు ప్రస్తుతం మరోసారి ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2025, 03:42 PM IST
  • జగన్ పై మండిపడిన షర్మిల..
  • చరిత్రలో హీనుడుగా మిగిలిపోతాడని వ్యాఖ్యలు..
YS Sharmila VS Jagan: కన్నతల్లితో పాటు నా బిడ్డలకు ద్రోహం.. జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడిన వైఎస్ షర్మిల..

Ys Sharmila fires on ys jagan on property issue: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్ గత పాలనతో ఏపీ అంతా అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు. సొంత వాళ్లకు న్యాయంచేయలేని జగన్, మిగత ప్రజలకు ఏంచేస్తాడని మండిపడ్డారు. గతంలో సరస్వతి షేర్ల విషయంలో గిఫ్ట్ డీడ్ రాసి.. తన తల్లి విజయమ్మకు ఇచ్చాడన్నారు. కానీ అదే గిఫ్ట్ మరల తిరిగి ఇచ్చేయాలని కూడా కోర్టులో కేసులు వేశారన్నారు. తన పిల్లలకు రావాల్సిన ఆస్తి ఏది కూడా రాకుండా చేశాడని చెప్పుకొచ్చింది.

Add Zee News as a Preferred Source

వైఎస్ జగన్ కన్న తల్లిపై కేసు పెట్టిన నీచుడని మండిపడింది. మేనమామను తల్లితర్వాత తల్లిలాంటి వాడు అంటారని.. అలాంటి వ్యక్తి ఈరోజు తన ఇద్దరు పిల్లలకు కూడా మోసం చేశాడని కూడా వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో  ధ్వజమెత్తారు.  జగన్ చరిత్రలో  ఒక హీనుడుగా మిగిలిపోతారని మండిపడ్డారు. జగన్ తనకు కావాలిస్తే ఏటైన మాటలు మారుస్తాడని.. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి లాంటి వాళ్లతో ట్యూషన్ లు చెప్పి మరీ జగన్ అనుకన్న మాటలు చెప్పే విధంగా చేస్తాడని కూడా వైఎస్ షర్మిల తన అన్నపై శివాలెత్తిపోయారు.

మరోవైసు కూటమి పాలనపై కూడా షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ప్రధాని నరేంద్రమోదీ ఇన్నిసార్లు ఏపీకి వచ్చి.. ఏంవెలగబెట్టారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపనులు జెట్ స్పీడ్ లో ముందుకు పోతుందన్నారు.. ఏపీ ప్రజల బతుకులు మారాలంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమైన పరిష్కారమని వైఎస్ షర్మిల అన్నారు. విభజన హక్కుల్ని సాధించుకొవడంలో కూటమి అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వైఎస్  షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News