)
Cops molested and death threat on woman victim in Chittoor: సమాజంలో ఎవరికైన అన్యాయం జరిగితే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఇదంతా మనం చూస్తుంటాం.
కానీ కాపాడేవారే కామాంధులుగా మారిన ఏపీలోని చిత్తూరులో చోటు చేసుకుంది. కొంత మంది ఇలాంటి నీచపు పనులు చేసిన మొత్తంగా డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు వస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలో దీన్ని బట్టి చూస్తే మహిళలపై దారుణాలు ఏ రెంజ్ లో ఉన్నాయో అర్థం అవుతుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్లో భర్త వేధిస్తున్నాడని వివాహిత స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో ఆమె నంబర్ తీసుకున్న హోంగార్డు ఆమెకు తరచుగా ఫోన్ లు చేస్తు, తనకు లొంగిపోవాలని మానసికంగా వేధించాడంతో మహిళ విసిగిపోయింది.
ఇక లాభంలేదని, హోంగార్డు వేధింపులు తట్టుకోలేక బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్‌ను సాయం అడింది. దీంతో ఇదే అదనుగా భావించిన అతగాడు..ఆమెను సీక్రెట్ ప్రదేశంలోకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి ఏకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం బైట చెబితే చంపేస్తానని బెదిరించాడు. సదరు మహిళ ఎలాగోలా బైటపడి చిత్తూరు ఎస్పీఆఫీస్ కు వెళ్లి తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేయగా ఆయన డీఎస్పీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన డీఎస్పీ డేగల ప్రభాకర్.. నిందితులిద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటన ఏపీలో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలొ అది కూడా పోలీసుల తీరు ఇదేంటని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.