CoronaVirus Cases: ఏపీలో ఒక్కరోజే ఏకంగా 762 మంది డిశ్ఛార్జ్

Tue, 07 Jul 2020-4:13 pm,

ఏపీలో కరోనా కేసులు (CoronaVirus Cases In Andhra Pradesh) వరుస రోజులలో వెయ్యికి పైగా పైగా నమోదయ్యాయి. తాజాగా 1100కు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులను గడిచిన 24 గంటలలో ఏపీలో గుర్తించారు. అదే సమయంలోో రాష్ట్రంలో ఏకంగా 13 మంది కరోనా బారిన పడి మరణించారు.

AP CoronaVirus Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1155 మందికి కరోనా సోకగా, మిగతా 23 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP Corona Positive Cases) 21,197కు చేరుకున్నాయి.  భార‌త్‌లో 7ల‌క్షలు దాటిన కరోనా కేసులు


రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 9,745 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 11,200 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 13 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 252కి చేరింది.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్


తాజాగా కర్నూలు జిల్లాలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 1,178 మందికి కోవిడ్19 (COVID19) పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 762 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీసీ బస్సులో మద్యం అక్రమ రవాణా.. చాకచక్యంగా పట్టుకున్న ఏపీ పోలీసులు


నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 10,50,090 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 18,520 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,257 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 420 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 7న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link