IAS Officers Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈసారి సీనియర్ అధికారులకు స్థాన చలనం కల్పించింది. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కొందరు అధికారులకు బదిలీ చేయగా.. మరికొందరు అధికారులకు పోస్టింగ్ చేయడం గమనార్హం. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిసోడియాను బదిలీ చేయగా.. ఆమె స్థానంలో జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Also Read: Kailasapatnam Fireworks: 'కైలాసపట్నం' ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
రెవెన్యూ, భూ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్పీ సిసోడియా చేనేత, హస్తకళల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.
రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా జయలక్ష్మికి అదనపు బాధ్యతల అప్పగింత. ప్రస్తుతం సీసీఎల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయలక్ష్మి ఉన్నారు.
ఐటీ కార్యదర్శిగా ఉన్న కాటమనేని భాస్కర్‌కు హెచ్‌ఆర్‌డీ సంస్థ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతల అప్పగించారు.
సీనియర్ అధికారులకు పోస్టింగ్
- రేవు ముత్యాలరాజు (2007) కమిషనర్, పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ
- కే మాధవీలత (2014) సీఈవో, ఏపీ రైతు బజార్
- ఎం గౌతమి (2014) కార్యదర్శి, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ (గురుకులం)
- కొత్తమాసు దినేష్ కుమార్ (2017) డైరెక్టర్, ఆయుష్
- కె నీలకంఠారెడ్డి (2017) మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
Also Read: Rajiv Yuva Vikasam: లాభాలు వచ్చే వ్యాపారం చేయాలనేవారికి అద్భుత అవకాశం.. ఎల్లుండే ఆఖరి తేదీ
బదిలీ, పోస్టుల వెనుక ఇదే?
ఏపీలో ఐఏఎస్‌లను బదిలీ మరోసారి జరిగింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మరికొందరికి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖాధిపతి ఆర్‌పీ సిసోడియాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెవెన్యూశాఖాధిపతిగా ఆర్‌పీ సిసోడియాను ప్రభుత్వం నియమించింది. అయితే వైఎస్ జగన్ పాలనలో రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి అనేక అవకతవకలు, అవినీతి, అక్రమాలు జరగడంతో సీనియర్ ఐఏఎస్ అయిన సిసోడియాను ఆశాఖలో నియమించింది. అయితే ఆయన ప్రభుత్వం అనుకున్న రీతిలో పని చేయలేకపోయారు. దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజల నుంచి వస్తున్న భూ సమస్యలకు పరిష్కరించలేకపోవడం.. శాఖలో ఆయన పనితీరుపై విమర్శలు ఉండడంతో ఆయన బదిలీ వేటు పడింది. చేనేత, వస్త్రపరిశ్రమ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియాను నియమించారు.
గతంలో సిసోడియా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ బాధ్యతల నుంచి కూడా ప్రభుత్వం తొలగించింది. సిసోడియా నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖను జి.జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీహెచ్‌ఆర్డీఐ డైరెక్టర్ జనరల్‌గా ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌కు అదనపు బాధ్యతలను ఇచ్చారు. గత ప్రభుత్వంలో జగన్‌తో సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వడం గమనార్హం. జగన్ కార్యాలయంలో పనిచేసిన ముత్యాలరాజుకు గ్రామీణాభివృద్ధి రాష్ట్ర సంస్థ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా నియమించారు.
వెయిటింగ్‌లో ఉన్న కె.మాధవీలతను ఏపీ రైతు బజార్ సీఈఓగా నియమించగా.. గౌతమిని ఆదివాసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమించారు. ఇటీవల వరకూ ఏపీ ఫైబర్ నెట్ ఎండీ ఉండి జీవీ రెడ్డితో విబేధాలు పెట్టుకున్న కె దినేష్‌కుమార్‌ను ఆయుష్ డైరెక్టర్ పోస్టు ఇచ్చారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.నీలకంఠారెడ్డికి ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









