BJP New President: బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికపై కాషాయ పార్టీ స్పీడ్ పెంచింది. దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. నేషనల్ చీఫ్ నియామకం కోసం పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్న జేపీ నడ్డాను ప్రధాని మోడీ కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. దాంతో ఆయన స్థానంలో కొత్త నేతకు అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ రేసులో పలువురు పేర్లను పరిశీలించిన పార్టీ పెద్దలు.. చివరకు మహిళా నేతకే పార్టీ చీఫ్ పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయ్యారట. అందులోనూ దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఓ మహిళా లీడర్‌కు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ నేషనల్ చీఫ్ పదవి రేసులో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి, తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్ పగ్గాలు చేపట్టాక.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పదేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఈ అనుభవాలన్నీ ఆమెకు బీజేపీ నేషనల్‌ప్రెసిడెంట్ పోస్టు అప్పగించేందుకు అదనపు బలం అవుతుందని పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఆమె చాలా దూకుడుగా వ్యవహరిస్తారన్న ప్రచారముంది. ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె చాలా కాలంగా బీజేపీలోనే ఉన్నారు. తమిళనాడును రెండుగా విభజించి కొంగునాడు ఏర్పాటు చేయాలని బలంగా వాదిస్తున్నారు. ఈమె పేరును హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
వాస్తవానికి కమలం పార్టీ ఈసారి జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణాది రాష్ట్రానికి ఇవ్వాలని అనుకోవడం వెనుక బలమైన కారణమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఉత్తరాధిలో విస్తరించినట్టుగా దక్షిణాదిలో ఆ పార్టీ సత్తా చాటలేకపోతోంది.. పదేళ్ల క్రితం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఆ వెంటనే తిరిగి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇక తెలంగాణలోనూ కమలం వికాసం కోసం పార్టీ నేతలు ఎంతో కష్టపడుతున్న ఫలితాలు మాత్రం ఆశించినా స్థాయిలో రావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా కమలనాథులు ప్రయత్నించారు. కానీ ఆ పార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే దక్కాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక తమిళనాడులోనూ బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే.. ఈ నేపథ్యంలోనే దక్షిణాదికి చెందిన నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారట.
ఇదిలా ఉంటే.. బీజేపీ చీఫ్‌గా ఎవరున్నా.. పార్టీ నిర్ణయాలన్నీ మోడీ, అమిత్ షానే చూసుకుంటారు. ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేసిన అధ్యక్షులంతా షా కనుసన్నల్లోనే పని చేస్తూ పార్టీని నడిపించారు. కాబట్టి దక్షిణాదికి చెందిన నేతకు పదవి ఇచ్చినా.. పవర్ మాత్రం తమ చేతుల్లోనే ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు త్వరలోనే డీ లిమిటేషన్‌పై కేంద్రం ముందుకు వెళ్లే ఆలోచనలో ఉంది. ఇది అమలైతే దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో అసంతృప్తి రేగకుండా నేషనల్ ప్రెసిడెంట్ పోస్టును దక్షిణాదికి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.
Also Read: Amrutha Pranay: ఐపాయ్.. ఇన్ స్టాలో భర్త పేరు తొలగించిన అమృత.. కారణం అదేనా అంటూ సోషల్ మీడియాలో రచ్చ..
Also Read: Hyderabad: హైదరాబాద్‌లోని శివాలయంలో మరో ఘోరం.. ఏకంగా శివలింగంపై కాలుపెట్టి మరీ.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









