AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి

AP:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది.  మల్యాలలో షాబానాపై ఇద్దరు వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Written by - Bhoomi | Last Updated : Mar 16, 2025, 10:02 PM IST
AP:  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి

AP:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందా రెడ్డి హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది.  మల్యాలలో షాబానాపై ఇద్దరు వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్యాలలో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఇద్దరు మహిళలు ఉద్దేశపూర్వకంగా ఇంట్లోకి చొరబడి పథకం ప్రకారం దాడి  చేసినట్లు షబానా తెలిపింది. 

Add Zee News as a Preferred Source

ఏడాదిలోపు దస్తగిరిని నరికేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. షబానాపై దాడి విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దస్తగిరిపై కూడా వైసీపీ మహిళా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. జగన్, అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా దస్తగిరి మాట్లాడుతారా అంటూ విచక్షణారహితంగా కొట్టారని వాపోయింది. మల్యాల గ్రామానికి చెందిన శంషున్, పర్వీన్ ను ఎవరు పంపిస్తే నాపై దాడి చేశారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు.

Also Read: Investment schemes: ఈ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే నెలకు 50 వేలు మీ జేబులోకి వెళ్ళినట్టే   

రంగన్న చనిపోయిన తర్వాత నా భర్తను చంపాలని చూస్తున్నారని షబానా తెలిపారు. ఇద్దరు మహిళలు పదే పదే అవినాశ్ రెడ్డి పేరును ప్రస్తావించినట్లు తెలిపారు. నిన్న సాయంత్రం ఘటన జరిగితే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ షబానా ఆవేదన వ్యక్తం చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News