Visakhapatnam: షాకింగ్.. దొంగ పోలీసు ఆట అంటూ అత్తను పెట్రోల్‌పోసి తగలెట్టిన కోడలు.. ఎందుకో తెలుసా..?

Daughter in law kills her mother in law in vizag: అత్తను చంపేయాలని పక్కాగా ప్లాన్ చేసింది. దీంతో ఆమెను ఒక చైర్ కు కట్టేసింది. కళ్లకు గంతలు కూడా కట్టింది. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమె మీద పోసింది.ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 8, 2025, 02:53 PM IST
  • అత్తను స్కెచ్ వేసి చంపిన కోడలు..
  • విశాఖ పట్నంలో షాకింగ్ ఘటన..
Visakhapatnam: షాకింగ్.. దొంగ పోలీసు ఆట అంటూ అత్తను పెట్రోల్‌పోసి తగలెట్టిన కోడలు.. ఎందుకో తెలుసా..?

Daughter in law kills her mother in law by pouring petrol in Visakhapatnam: ఇటీవల కాలంలో సమాజంలో అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అసలు మానవత్వం ఉందా..?.. అన్న అనుమానాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల కట్టుకున్న వాళ్లను, తల్లి తండ్రులను, తమ పిల్లలను హతమారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల వివాహేతర సంబంధాల మోజులో పడి మరీ దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

సాధారణంగా ఏ ఇంట్లో అయిన అత్తా కోడళ్ల మధ్య గొడవలు నార్మల్గా జరుగుతుంటాయి. కొంత మంది వీటిని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటారు. కానీ కొంత మాత్రం గొడవలు పడి మర్డర్ ల వరకు వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.

విశాఖపట్నం లోని పెందుర్తికి చెందిన జయంతి కనక మహాలక్ష్మి (66) ఇటీవల అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయి చనిపోయింది. పోలీసుల ఈ ఘటనలో లోతుగా విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అగ్నిప్రమాదం జరిగి తన అత్త చనిపోయిందని చెప్పిన కోడలు లలితే ఆమెను హత్య చంపిన విషయం బైటపడింది.

అగ్నిప్రమాదం ఆటతో.. ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్తా తనను పదే పదే కొన్ని విషయాల్లో కండీషన్ లు పెడుతుందని,  చీటికి మాటికి చిరాకు తెప్పిస్తుందని కోడలు లలిత పక్కాగా స్కెచ్ వేసింది. దీనిలో భాగంగా..

 దొంగ - పోలీస్ ఆట ఆడదామని అత్తను నమ్మించింది. ఆమె మాటలకు సరే అని చెప్పడంతో తన పథకాన్ని అమలు చేసింది. కుర్చీపై కూర్చున్న అత్త కాళ్లు, చేతులు కట్టేసింది. ఆ తర్వాత కళ్లకు గంతలు కూడా కట్టేసింది.

ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై పోసింది. వెంటనే అందరు ఇంటి నుంచి బైటకు వచ్చేసి.. ఆమెపై దీపం విసిరేసింది.  మంటలు వ్యాపించగానే.. తలుపులు వేసి బయటికి పారిపోయింది. ఆతర్వాత మా అత్త మంటల్లో చిక్కుకుందని దొంగ నాటకాలు ఆడింది. 

Read more: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. డిటెయిల్స్..

 ఈ నేపథ్యంలో లలిత ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు లలితను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏపీలో ప్రస్తుతం సంచలనంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News