Pawan Kalyan Tweet: చంద్రబాబు పుట్టిన రోజు.. డిప్యూటీ సీఎం స్పెషల్ బర్త్ డే విషేష్.. విజనరీ లీడర్ అంటూ..

Pawan kalyan Birthday wishes to chandrababu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా బర్త్ డే విషేస్ చెప్పారు.  విజనరీ లీడర్ అంటూ కూడా కొనియాడారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 20, 2025, 01:11 PM IST
  • ఘనంగా చంద్రబాబు బర్త్ డే వేడుకలు..
  • పండగలా నిర్వహిస్తున్న కూటమి శ్రేణులు..
Pawan Kalyan Tweet: చంద్రబాబు పుట్టిన రోజు.. డిప్యూటీ సీఎం స్పెషల్ బర్త్ డే విషేష్.. విజనరీ లీడర్ అంటూ..

Pawan kalyan and modi birthday wishes to CM Chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 75వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం టీడీపీ శ్రేణులు బాబు బర్త్ డే వేళ ప్రత్యేకంగా సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.  సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి తన బర్త్ డే వేళ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీపర్యటనలో ఉన్నారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలను ఎక్స్ వేదికగా తెలిపారు.
అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు.

 

గత ప్రభుత్వ పాలనలో.. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని  పునర్జీవింప చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమన్నారు. అదే విధంగా విజనరీ లీడర్, పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ న ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.

నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజన్, నిరంతరం పనిలో ఆయన చూపే ఉత్సాహం అద్భుతమన్నారు. అదేవిధంగా పాలనలో.. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను ఉరుకులు పరుగులు పెట్టించి, దానికి అనుగుణంగా తీసుకునే విధానపర నిర్ణయాలు స్ఫూర్తిదాయకమన్నారు.

వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన.. ఏపీ ముఖ్య మంత్రి  శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాట్లు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు జన్మదిన వేళ దేశ  ప్రధాని మోదీ సైతం ప్రత్యేకంగా.. నా మిత్రుడు  అనిసంభోధిస్తు.. చంద్రబాబుకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్విట్ చేశారు. అదే విధంగా మాజీ సీఎం జగన్ సైతం..  చంద్రబాబుకు బర్త్ డే వేళ ఎక్స్ వేదికగా విషేస్ చెప్పారు.

Read more: AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి..

 ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీన్, నందమూరీ కుటుంబం, సెలబ్రీటీలు, రాజకీయనేతలు ప్రత్యేకంగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా సీఎం చంద్రబాబు నేపథ్యంలో టీటీపీ నేతలు, కార్యకర్తలు రెండు తెలుగు స్టేట్స్ లలో పలు చోట్ల గుడిలో పూజలు, అన్నదానాలు,రక్తదానాలు, ఆస్పత్రులలో ఫ్రూట్స్ పంపిణి కార్యక్రమాలు చేపట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News