Pithapuram Pawan Kalyan: అధికారంలోకి వచ్చిన అనంతరం జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో అభివృద్ధి పరవళ్లు తొక్కుతోంది. నిధులు వరదలా పారుతున్నాయి.. సంక్షేమ పథకాలు పరుగులు తీస్తున్నాయి. రూపురేఖలు మారిపోయేలా పిఠాపురం అభివృద్ధి చెందుతుంటే పవన్ కల్యాణ్ మరో కానుక అందించారు. ఆయనలోని మంచితనం.. మానవత్వం మరోసారి నిరూపితమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Yoga Andhra 2025: యోగాంధ్ర 2025కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీ, చంద్రబాబు షెడ్యూల్ ఇదే!
ఏం జరిగింది?
పిఠాపురం మండలం మల్లం గ్రామంలో జన సైనికుడు విద్యుదాఘాతానికి గురయి ఇటీవల మృతి చెందాడు. కరెంటు షాక్‌తో మరణాలు సంభవించడంతో పవన్ కల్యాణ్ మదిలో కొత్త ఆలోచన వచ్చింది. ఎలక్ట్రిషన్ మాదిరి దురదృష్ట సంఘటనలు జరగకూడదని పిఠాపురం నియోజకవర్గంలో 320 మందికి ఎలక్ట్రిక్ కార్మికులకు పవన్ కల్యాణ్ భద్రతా కిట్లు అందించారు. దీనికి తన సొంత డబ్బులు రూ.16 లక్షలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెచ్చించారు.
Also Read: RTC Free Bus Journey: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం
ఆ నిధులతో జనసేన పార్టీ నాయకులు గురువారం పిఠాపురంలోని అంబేద్కర్ భవన్‌లో అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మర్రెడ్డి శ్రీనివాస రావు, చెల్లుబోయిన సతీశ్ కీలక విషయాలు వెల్లడించారు. కార్మికులను పట్టించుకున్నది ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కల్యాణ్ మాత్రమే. ఒక ఎలక్ట్రిషన్ కార్మికడి మరణంతో ఒ కుటుంబం రోడ్డు పాలవడంతో మరో కుటుంబం అలా కాకూడదని పవన్ కల్యాణ్ భావించారు. ముందుచూపుతో ఎలక్ట్రిషన్‌లందరికీ రూ.16 లక్షలు సొంత డబ్బును ఖర్చు చేసి 320 మందికి భద్రతాపరమైన కిట్లు పవన్ కల్యాణ్ అందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఈస్టర్ గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, కోపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మేళం బాబీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ వక్కపల్లి దేవి సూర్యప్రకాష్, ఎస్సి సెల్ దానం లాజర్ బాబు, బీఎన్ రాజు, ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమణ రాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









